క్రీడా ప్రపంచంలో ఐపీఎల్ వచ్చాక బ్యాటర్స్ సింగిల్స్ తియ్యడమే మర్చిపోయారు. ఎడా పెడా ఫోర్లు, సిక్స్ లను బాదడమే లక్ష్యంగా తమ బ్యాటింగ్ ను కొనసాగిస్తున్నారు. ఇక సిక్స్ లకు పెట్టింది పేరుగా కొందరు క్రికెటర్స్ కు పేరుంది. వారిలో క్రిస్ గేల్, పొల్లార్డ్, రోహిత్, ధోనీ లాంటి వారు ముందు వరుసలో ఉన్నప్పటికీ ఇంకా చాలా మంది ఆటగాళ్లు భారీ సిక్స్ లను బాదడంలో సిద్దహస్తులు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ వేదికగా ది హండ్రెడ్ లీగ్ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ లో ఓ భారీ సిక్సర్ నమోదు అయ్యింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
క్రికెట్ లో భారీ సిక్సర్ కొట్టాడు అనగానే ఏ గేల్ అనో.. లేదా పొల్లార్డ్ అనో.. పేరు వినిపిస్తుంది. కానీ తాజాగా ది హండ్రెడ్ లీగ్ ఓ భారీ సిక్సర్ నమోదు అయ్యింది. దాన్ని కొట్టింది ఇంగ్లీష్ ఆటగాడు అలెక్స్ హేల్స్. ఈ భారీ సిక్సర్ ట్రెంట్ రాకెట్స్-ఓవల్ ఇన్విన్స్ బిల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో నమోదు అయ్యింది. ట్రెంట్ రాకెట్స్ బ్యాటర్ అయిన హేల్స్ ప్రత్యర్థి బౌలర్స్ పై ఫోర్లు, సిక్సర్స్ తో విరుచుకు పడ్డాడు. మహమ్మద్ హస్నైన్ బౌలింగ్ లో అతడు కొట్టిన ఓ సిక్సర్ ఏకంగా గ్రౌండ్ బయటపడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
మెుదట బ్యాటింగ్ చేసిన రాకెట్స్ జట్టు నిర్ణీత 100 బాల్స్ లో ఏకంగా 180 పరుగులు చేసింది. అలెక్స్ హేల్స్ 29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్ లతో 59 రన్స్ చేశాడు. ఇక ఇతడి స్ట్రైక్ రేట్ ఏకంగా 203.44 ఉండటం విశేషం. అలెక్స్ చేసిన 59 పరుగుల్లో 48 రన్స్ బౌండరీల ద్వారా వచ్చినవే కావడం విశేషం. ఇక 180 పరుగుల భారీ లక్ష్యంతో బ రిలోకి దిగిన ఓవల్ జట్టు 165 రన్స్ చేసి 25 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ప్రస్తుతం ఈ భారీ సిక్సర్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇంతటి భారీ సిక్స్ కొట్టిన అలెక్స్ హేల్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.