యాషెస్ లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ స్పెషల్ గా మారుతున్నాడు. లార్డ్స్ టెస్టులో భాగంగా బెయిర్ స్టోని రానౌట్ చేసి వార్తల్లో నిలిచిన క్యారీ.. ఆ విషయాన్ని మరువకముందే లీడ్స్ లో జరుగుతున్న టెస్టులో మరోసారి చర్చనీయాంశమయ్యాడు.
యాషెస్ లో భాగంగా హెడింగ్లేలో జరుగుతున్న మూడో టెస్టు నువ్వా నేనా అనేట్లుగా సాగుతుంది. 3 వికెట్లను 68 పరుగులతో ఓవర్ నైట్ స్కోర్ తో ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ 237 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ స్టోక్స్(80) మరోసారి ఒంటరి పోరాటం చేసి ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని తగ్గించాడు. దీంతో ఆసీస్ కి తొలి ఇన్నింగ్స్ లో 26 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఇదిలా ఉండగా తొలి రోజు ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓపెనర్ బెన్ డకెట్ ఊహించని రీతిలో ఔటయ్యాడు. క్యారీ ఎంతో వెరైటీగా పట్టిన ఈ క్యాచ్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక మాజీలు అయితే క్యారీ పట్టిన క్యాచ్ కి తెగ నవ్వుకుంటున్నారు.
యాషెస్ లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ స్పెషల్ గా మారుతున్నాడు. లార్డ్స్ టెస్టులో భాగంగా బెయిర్ స్టోని రానౌట్ చేసి వార్తల్లో నిలిచిన క్యారీ.. ఆ విషయాన్ని మరువకముందే లీడ్స్ లో జరుగుతున్న టెస్టులో మరోసారి చర్చనీయాంశమయ్యాడు. పూర్తి వివరాళ్లోకేతే..నాలుగో ఓవర్లో ఆసీస్ కెప్టెన్ కమిన్స్ వేసిన బంతి వెళ్లి ఇంగ్లాండ్ ఓపెనర్ డకెట్ బ్యాట్‌ను తాకుతూ కీపర్, ఫస్ట్ స్లిప్ దిశగా వెళ్లింది. అయితే అప్రమత్తమైన వికెట్ కీపర్ క్యారీ డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. ఇందులో ఏముంది అనుకుంటే పొరపాటే. బంతిని నియంత్రించే క్రమంలో బంతి గ్లవ్స్ నుంచి బయటకు వచ్చింది. కింద పడినట్లుగా అనిపించినా క్యారీ బంతిని చాలా తెలివిగా అందుకున్నాడు.
బంతిని పెదవులు, నోటి సహాయంతో కింద పడకుండా అడ్డుకున్నాడు. దీంతో ఈ ఇంగ్లాండ్ ఓపెనర్ నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. ఈ సమయంలో కామెంట్రీ చేస్తున్న మోర్గాన్ ఈ క్యాచ్ గురించి స్పందిస్తూ “అది కచ్చితంగా ముద్దే. అలెక్స్ క్యారీ ఇది స్టేడియం ఇక్కడ పద్దతిగా ఉండు. అదేం పని అంటూ జోక్ చేశాడు. దీంతో టీవీల్లో మ్యాచు చూస్తున్నవారు, తోటీ కామెంటేటర్లు తెగ నవ్వుకున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే ఈ క్యాచ్ గురించి రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ‘ఇలా స్టేడియంలో ముద్దులు పెట్టేస్తే ఎలా క్యారీ?’ అని అడుగుతుంటే మరికొందరేమో తాము ఇప్పటి వరకు ఇంత ఫన్నీ క్యాచ్ చూడలేదంటున్నారు. మొత్తానికి క్యారీ క్యాచ్ అందరికీ ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది. ఈ క్యాచ్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.