ఒకప్పుడు అడపాదడపగా బ్యాటింగ్ చేసే ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ క్యారీ.. ఇపుడు మాత్రం లోయర్ ఆర్డర్ లో కీలక పరుగులు చేస్తూ జట్టు విజయానికి కారణమవుతున్నాడు. అయితే ఈ వికెట్ కీపర్ ఇలా రాణించడం వెనుక అసలు రహస్యం కోహ్లీ అని చెప్పేసాడు
టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషిన్, కింగ్ విరాట్ కోహ్లీ క్రికెట్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇండియన్ క్రికెట్ లోఇప్పటికే దాదాపు సగం రికార్డులను తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ.. మరికొన్ని రికార్డులను బద్దలు కొట్టడం గ్యారంటీ. అయితే కోహ్లీ ఒక్క ఆటలోనే కాదు తోటి ప్లేయర్లకు విలువైన సలహాలిస్తూ వారి సక్సెస్ కి కారణమవుతాడు. ఐపీఎల్ లో మ్యాచ్ ముగిసిన అనంతరం ఎంతోమంది జూనియర్ ప్లేయర్లకు కోహ్లీ సలహాలివ్వడం మనం చాల సార్లు చూసాం. అయితే ఇప్పుడు విరాట్ ఆస్ట్రేలియా క్రికెటర్ క్యారీకి ఇచ్చిన ఒక సలహా వలన ఒక మంచి ఇన్నింగ్స్ ఆడానని చెప్పుకొస్తున్నాడు. ఇంతకీ కోహ్లీ క్యారీకి ఏం సలహా ఇచ్చాడో ఇప్పుడు చూద్దాం.
యాషెస్ లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ నిన్న ముగిసింది. చివరి రోజు చివరి వరకు జరిగిన ఈ మ్యాచులో ఆస్ట్రేలియా థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. ఇంగ్లాండ్ నిర్ధేశించిన 281 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఒక దశలో ఆసీస్ ఓటమి ఖాయమన్నా చివర్లో కెప్టెన్ కమ్మిన్స్, లియాన్ పోరాటం ఇంగ్లాండ్ కి పరాజయాన్ని మిగిల్చింది. బజ్ బాల్ అంటూ ఇంగ్లాండ్ చూపిన దూకుడికి ఆసీస్ ఇంగ్లాండ్ కి కళ్లెం వేసింది. ఇక ఈ మ్యాచులో వికెట్ కీపర్ క్యారీ మొదటి ఇన్నింగ్స్ లో అర్ధ సెంచరీ చేసి ఆసీస్ ని ఆదుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ లో కూడా కీలకమైన 20 పరుగులు చేసాడు. అంతే కాదు డబ్ల్యూటీసీ ఫైనల్లో 48,66 పరుగులు చేసి భారత్ ఓటమికి కారణమయ్యాడు.
ఒకప్పుడు అడపాదడపగా బ్యాటింగ్ చేసే క్యారీ.. ఇపుడు మాత్రం లోయర్ ఆర్డర్ లో కీలక పరుగులు చేస్తూ జట్టు విజయానికి అయితే ఈ వికెట్ కీపర్ అసలు రహస్యం కోహ్లీ అని చెప్పేసాడు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. “డబ్ల్యూటీసీ ఫైనల్ కి ముందు విరాట్ కోహ్లీ ఇచ్చిన కీలక సలహాల వలెనే కీలక ఇన్నింగ్స్ ఆడాను. ముఖ్యంగా కోహ్లీ నన్ను స్పిన్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ ఆడవద్దని సూచించాడు. ఈ సలహా నాకెంతగానో పని చేసింది. ఒకప్పుడు నిలక్ష్యంగా ఈ షాట్ ఆడి వికెట్ పారేసుకుని వాడిని. కానీ ఇప్పుడు అలాంటి షాట్ ఆడటం లేదు”.అని క్యారీ చెప్పుకొచ్చాడు. మరి క్యారీ మంచి ప్రదర్శన చేయడానికి కోహ్లీ కారణమవడం మీకేవిధంగా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.