టీమిండియా క్రికెటర్ అక్షర్ పటేల్ ఓ ఇంటివాడు కానున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు మేహాతో గురువారం ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. కాగా తన 28వ పుట్టిన రోజున అక్షర్ ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం విశేషం. అక్షర్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఫొటోల్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. “ఈ రోజు మా కొత్త జీవితానికి ఆరంభం, ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తునే ఉంటాను” అని క్యాప్షన్ జోడించాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరికి టీమిండియా క్రికెటర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో కంగ్రాట్స్ చెప్తున్నారు.