టీమిండియా మాజీ వైస్ కెప్టెన్, టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ అజింక్యా రహానే హైదరాబాద్‌పై చెలరేగి ఆడుతున్నాడు. బ్యాడ్‌ఫామ్‌తో టీమిండియా టెస్ట్ టీమ్‌లో చోటు కోల్పోయిన తర్వాత దేశవాళీ టోర్నీలపై ఫోకస్ పెట్టిన రహానే.. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో ముంబై కెప్టెన్‌గా వ్యహరిస్తున్నాడు. ఈ నెల 13 నుంచి రంజీ సీజన్ 2022-23 ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆంధ్రాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 44 పరుగులతో పర్వాలేదనిపించిన రహానే.. హైదరాబాద్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఫోర్ల వర్షం కురిపిస్తూ.. పరుగుల వరద పారిస్తున్నాడు. అంతకు ముందే టీమిండియా టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ 80 బంతుల్లో 90 పరుగులు చేసి కొద్ది సెంచరీ మిస్ చేసుకోగా.. రహానే మాత్రం హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.
253 బంతుల్లో 26 ఫోర్లు, 3 సిక్సులతో 200 పరుగులు చేసి రహానే.. తన మునుపటి ఫామ్‌ను అందుకున్నట్లు కనిపించాడు. హైదరాబాద్ బౌలర్లపై పూర్తి స్థాయి ఆధిపత్యం ప్రదర్శించిన రహానే.. ఫోర్ల వరద పారించాడు. మంగళవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుని.. ముంబైని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన పృథ్వీ షా.. కేవలం 19 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత.. క్రీజ్‌లోకి వచ్చిన మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్, జైస్వాల్‌తో కలిసి.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలిసి ముంబైకి 153 పరుగుల భాగస్వామ్యం అందించారు. 80 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్స్‌తో 90 పరుగులు చేసి సూర్య.. శశాంక్ బౌలింగ్‌లో అవుటై.. కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మూడేళ్ల తర్వాత రంజీ బరిలోకి దిగిన సూర్య.. తొలి ఇన్నింగ్స్‌లోనే మంచి పరుగులు చేయడం విశేషం.
ఇక సూర్య అవుటైన తర్వాత.. జైస్వాల్‌తో జతకట్టిన ముంబై కెప్టెన్ అజింక్యా రహానే.. పరుగుల వరుద పారించాడు. 162 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్.. రహానేతో 200 పైచిలుకు భాగస్వామ్యానికి తెరదించుతూ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మరో స్టార్ ప్లేయర్ సర్ఫారాజ్ ఖాన్ సైతం హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 125 బంతుల్లో 16 ఫోర్లతో 106 రన్స్ చేసిన సర్ఫారాజ్ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక 261 బంతుల్లో 204 పరుగులు చేసిన రహానే త్యాగరాజన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఓపెనర్ పృథ్వీషా మినహా.. మిగతా బ్యాటర్లంతా రాణించడంతో రెండో రోజు తొలి సెషన్‌లో ముంబై 4 వికెట్లు కోల్పోయి 597 పరుగుల భారీ స్కోర్ చేసింది. మరి చాలా కాలం తర్వాత డబుల్ సెంచరీతో అదరగొట్టిన రహానేకు మళ్లీ టీమిండియా టెస్టు టీమ్‌లో చోటు దక్కుతుందో లేదో చూడాలి. రహానే ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
And that’s a double hundred for the Mumbai Captain, Ajinkya Rahane.#MUMvHYD #RanjiTrophy pic.twitter.com/A3R3VUGgbM
— Prajakta (@18prajakta) December 21, 2022
Double Century For Ajinkya Rahane 🤩😍
200*(253) with 23Fours 3Sixes ! ❤🔥#AjinkyaRahane #RanjiTrophy #mumvhyd pic.twitter.com/R1SvXP83bS— Ajinkya Rahane Fanclub (@AjinkyaRahane13) December 21, 2022