అజింక్య రహానే.. ఒక క్రికెటర్ గానే కాకుండా అతనికి వ్యక్తిగతంగానూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దూకుడు మొత్తం ఆటలో మాత్రమే చూపిస్తూ.. ఎంతో సౌమ్యంగా, హుందాగా ప్రవర్తించే తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే అజింక్య రహానే కెరీర్ లో కొన్ని మర్చిపోలేని సంఘటనల గురించి మరోసారి నెమరు వేసుకున్నారు. ఆ సంఘటనల్లో తాను ఎలా స్పందించింది? ఎంతలా బాధపడింది అభిమానులతో పంచుకున్నాడు. అందులో ఒకటి సిడ్నీ టెస్టులో మహ్మద్ సిరాజ్ పై జాత్యాంహకార వ్యాఖ్యలు, రెండు అడీలైడ్ టెస్టులో రహానే వల్ల విరాట్ కోహ్లీ రనౌట్ అయిన ఘటనల గురించి మరోసారి స్పందించాడు.
ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు.. సిడ్నీలో మహ్మద్ సిరాజ్ పై జరిగిన జాత్యాహంకార కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన గురించి రహానే మాట్లాడుతూ ‘సిరాజ్ అతనిపై చేసిన కామెంట్స్ గురించి నాకు చెప్పాడు. నేను వెంటనే అంపైర్ల వద్దకు వెళ్లి జరిగింది చెప్పాం. వారిపై చర్యలు తీసుకునే వరకు గేమ్ ఆడమని తేల్చి చెప్పాం. ఆ తర్వాత వ్యాఖ్యలు చేసిన వారిపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు చర్యలు తీసుకునేలా చేసింది’ అంటూ రహానే చెప్పుకొచ్చాడు.
After Mohammed Siraj was heckled and abused at the SCG, India captain Ajinkya Rahane insisted on getting the spectators ejected and only then carrying on with the Test
👉 https://t.co/Namq4baOFp pic.twitter.com/HaOcWbXMB3
— ESPNcricinfo (@ESPNcricinfo) June 1, 2022
అటు అడిలైడ్ రనౌట్ ఘటనపై కూడా రహానే స్పందించాడు. 2020 డిసెంబరులో జరిగిన ఆస్ట్రేలియా- టీమిండియా మొదటి టెస్టులో రహానే కారణంగా కోహ్లీ 74 పరుగుల వద్ద రనౌట్ అవుతాడు. ఆ తర్వాత రహానే కూడా కాసేపటికే పెవిలియన్ చేరుతాడు. మంచి ఫామ్ లోఉన్న కోహ్లీ రహానే వల్ల రనౌట్ గా పెవిలియన్ చేరడంతో రహానేపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మ్యాచ్ తర్వాత రనౌట్ విషయమై కోహ్లీకి క్షమాపణలు చెప్పినట్లు రహానే తెలిపాడు.
“I was hurt and sad more than Virat Kohli when Virat was run-out in the Adelaide Test match in 2020/21.” – Ajinkya Rahane (To Sports Yaari)
— CricketMAN2 (@ImTanujSingh) June 2, 2022
మళ్లీ మరోసారి ఆ ఘటనను గుర్చు చేసుకుని రహానే ఎమోషనల్ అయ్యాడు. ‘అడిలైడ్ టెస్టులో నా వల్ల కోహ్లీ రనౌట్ అయిన క్షణం నేను చాలా బాధ పడ్డాను. ఆ సమయంలో కోహ్లీ కంటే నేనే ఎక్కువ బాధ, పాశ్చాతాపం అనుభవించాను’ అంటూ రహానే ఆ క్షణాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. రహానే వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.