‘గాడ్ ఆఫ్ క్రికెట్’ గా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 24 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో సచిన్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. ఎన్నో మైలురాళ్లను చేరుకున్నాడు. చెరిగిపోని రికార్డులను తన పేరు మీద లిఖించుకున్నాడు. కెరీర్ లో 200 టెస్టు మ్యాచులాడిన సచిన్ 329 ఇన్నింగ్స్‌ల్లో 15921 పరుగులు చేశాడు. వన్డేల్లో 463 మ్యాచులాడిన సచిన్ 452 ఇన్నింగ్స్‌ల్లో 18426 పరుగులు చేశాడు.
అయితే.. సచిన్ పరుగుల గణాంకాలతో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ సమంగా నిలుస్తున్నాడు. టెస్టులు,వన్డేలు,టీ20లు.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ రాణించగల సత్తా ఉన్న క్రికెటర్ స్టీవ్ స్మిత్. రెండేళ్ల పాటు నిషేధం కారణంగా ఆటకు దూరమైన స్మిత్.. రీఎంట్రీ ఇచ్చాక మళ్లీ మునుపటి ఫామ్ ను అందుకున్నాడు. ఇప్పటివరకు టెస్టు క్రికెట్లో 83 మ్యాచ్‌లు ఆడిన స్మిత్ 148 ఇన్నింగ్స్‌ల్లో 7862 పరుగులు చేశాడు. అయితే గతంలో టెస్టు క్రికెట్‌లో సచిన్ 148 ఇన్నింగ్స్‌లు పూర్తి చేసుకున్నాక 7869 పరుగులు పూర్తి చేశాడు. కేవలం.. ఇద్దరికి 7 పరుగుల వ్యత్యాసం మాత్రమే ఉంది. 148 ఇన్నింగ్స్‌ల్లో.. సచిన్ ఎలాంటి గణాంకాలు కల్గి ఉన్నాడో.. ప్రస్తుతం స్మిత్ కూడా దాదాపు అలాంటి గణాంకాలనే కల్గి ఉండడం గమనార్హం.ఇక.. 148 ఇన్నింగ్స్‌ల్లో సచిన్ 29 సెంచరీలు చేయగా.. స్మిత్ 27 సెంచరీలు చేశాడు. రెండు సెంచరీల తేడా ఉంది. ఇదే సమయానికి సచిన్ 31 హాఫ్ సెంచరీలు చేయగా.. స్మిత్ 34 హాఫ్ సెంచరీలు చేశాడు. 3 హాఫ్ సెంచరీల తేడా మాత్రమే ఉంది. సచిన్ అత్యధిక స్కోర్ 248* కాగా, స్మిత్ అత్యధిక స్కోర్ 239గా ఉంది. కేవలం 9 పరుగుల తేడానే ఉంది. ఇక సగటు విషయానికొస్తే.. సచిన్‌ది 59 ఉండగా.. స్మిత్‌ది 60గా ఉంది. ఇక్కడ సగటు 1 మాత్రమే తేడా ఉంది. ఇలా టెస్టులతో వ్యక్తిగతంగా 148 ఇన్నింగ్స్‌లు పూర్తి అయ్యే సరికి సచిన్, స్మిత్ ఇన్నింగ్స్‌లు దాదాపు ఒకే విధంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
Almost identical numbers👀#PAKvAUS #SachinTendulkar #SteveSmith pic.twitter.com/xhxuFoW198
— CricTracker (@Cricketracker) March 9, 2022
#OnThisDay in 1990 V New Zealand 16Yrs Old @sachin_rt scored His First ODI Runs & The Journey of 18426 runs began.
Now Most Runs 100s 50s Belongs to SRT.🐐
Sachin in his –
First Two ODIs : 0,0
Last Two ODIs : 114,52https://t.co/XBKJsNNxhZpic.twitter.com/T3tqOwjEk8— Sachin Tendulkar Fan Club🇮🇳 (@CrickeTendulkar) March 6, 2022