ఆసియా కప్ 2022 లో సూపర్-4లో భాగంగా జరిగిన భారత్-పాక్ మ్యాచ్ పై ఇప్పటికీ చర్చ నడుస్తూనే ఉంది. కొంత మంది భారత్ కు మద్దతుగా నిలుస్తుంటే.. మరి కొందరు ఇండియాను విమర్శిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో క్యాచ్ మిస్ చేసి తీవ్ర విమర్శల పాలు అవుతోన్న అర్ష్ దీప్ వీకీపీడియా వ్యవహారాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఇక భారత జట్టుకు బీజేపీ నాయకురాలు విజయశాంతి సైతం అండగా నిలబడ్డారు. ఈ క్రమంలోనే భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ పై పాక్ మాజీ క్రికెటర్ అయిన మహ్మద్ హఫీజ్ దారుణమైన విమర్శలు చేశాడు. ప్రస్తుతం అతడు మాట్లాడిన మాటలు క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ వార్తకు సంబంధించి మరిన్నివివరల్లోకి వెళితే..
అది 2014.. ఆసియా కప్ లో భాగంగా మీర్ఫూర్ వేదికగా భారత్-పాక్ జట్లు తలపడ్డాయి. మెుదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 245 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో రోహిత్, రాయుడు, రవింద్ర జడేజాలు అర్దశతకాలతో రాణించారు. తర్వాత ఓ మోస్తారు లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ తడబడుతూనే లక్ష్యానికి చేరువగా వచ్చింది. ఈ క్రమంలో పాకిస్థాన్ కు చివరి రెండు ఓవర్లలో 13 పరుగులు అవసరం అయ్యాయి. అప్పుడు బౌలింగ్ కు వచ్చిన భువనేశ్వర్ కుమార్ తన ఓవర్ లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్ ను జారనియ్యలేదు. ఇక చివరి ఓవర్ ను వెయ్యడానికి స్పిన్నర్ అశ్విన్ రంగంలోకి దిగాడు.
అప్పటికే క్రీజ్ లో డాషింగ్ బ్యాట్స్ మెన్ అఫ్రీది ఉన్నాడు. మరో ఎండ్ లో జునైద్ ఖాన్ ఉన్నాడు. ఇక సింగిల్ తీసి అఫ్రీదికి స్ట్రైకింగ్ ఇచ్చాడు. అప్పటికే మంచి టచ్ లో ఉన్న అఫ్రీది అశ్విన్ బౌలింగ్ లో బాక్ టూ బాక్ సిక్స్ బాది పాకిస్థాన్ కు చిరస్మరణియమైన విజయాన్ని అందించాడు. అఫ్రీది కేవలం 18 బంతుల్లో 3 సిక్స్ లు, 2 ఫోర్లతో 34 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో హఫీజ్ 75 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ ను తాజాగా జరిగిన మ్యాచ్ తో పోల్చుతూ అశ్విన్ ను ట్రోల్ చేశాడు. పాక్ టీవీ ఛానెల్ అయిన PTV ఇంటర్వ్యూలో హఫీజ్ మాట్లాడుతూ.. ” ఈ సందర్బంగా షాహీద్ అఫ్రీదికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు గతంలో 2014 ఆసియా కప్ లో బాదిన రెండు సిక్స్ లు ఇప్పటికీ మర్చిపోలేను.
అప్పటి నుంచి ఇప్పటి వరకు అశ్విన్ రెగ్యూలర్ గా పాక్-భారత్ మ్యాచ్ లలో ఆడటం లేదు. ఆ భయం ఇప్పటి దాకా ఉందంటూ” వ్యంగ్యంగా మట్లాడాడు. ప్రస్తుతం ఆ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. అనుభవం లేని రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్ లను ఎందుకు తీసుకున్నారు అంటూ ప్రశ్నించాడు. మరి గతంలో జరిగిన మ్యాచ్ కు ఈ మ్యాచ్ కు ముడి పెడుతూ హఫీజ్ మట్లాడటంతో నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. దానికి దీనికి సంబంధం ఏంటి అంటూ విమర్శిస్తున్నారు. మరి హఫీజ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Why Ashwin not playing regularly in recent past #PAKvIND matches. Credit to @SAfridiOfficial Boom Boom master strokes in #AsiaCup2014 pic.twitter.com/0MjjUFJ4ia
— Mohammad Hafeez (@MHafeez22) September 5, 2022