టీ20 వరల్డ్ కప్ ఎంతో కీలకమైన న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ కి రంగం సిద్ధమైంది. గ్రూప్ 2 లో సెమీస్ బెర్త్ కోసం జరుగుతున్న ఈ మ్యాచ్.. ఈ రెండు జట్లకు కాకుండా టీమిండియాకి కూడా ఎంతో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఎంతో కీలకమైన ఈ మ్యాచ్ లో ఆఫ్ఘన్ ప్రదాన స్పిన్నర్ ముజీబ్ బరిలోకి రావడం భారత్ కి కలసి వచ్చే అంశంగా కనిపిస్తోంది.
ఈ గ్రౌండ్ లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉండటంతో.. టీమిండియా అభిమానులు అప్పుడే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘన్ విజయం సాధించి, ఇండియాకి సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంచుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.