టీ20 మ్యాచ్ లో పాకిస్థాన్ ఓడిపోయింది. ఇదే పెద్ద విచిత్రం కాకపోయినప్పటికీ.. అఫ్గానిస్థాన్ చేతిలో ఓటమిపాలవడం మాత్రం అందరూ మాట్లాడుకోవడానికి కారణమైంది. ఈ క్రమంలోనే అఫ్గాన్ జట్టు పొట్టి ఫార్మాట్ లో సరికొత్త చరిత్ర సృష్టించింది.
పాకిస్థాన్ జట్టుకు ఫస్ట్ టైమ్ ఓ షాక్ తగిలింది. దాని నుంచి కోలుకోవడానికి కాస్త టైమ్ పట్టొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు అఫ్గానిస్థాన్ జట్టు అనగానే సులభంగా గెలిచేయొచ్చు అనుకునేది. కానీ తాజాగా జరిగిన తొలి టీ20లో ఘోరంగా ఓడిపోవడంతో ఒక్కసారిగా కళ్లు తెరుచుకున్నాయి. అదే టైంలో ప్రత్యర్థి అఫ్గాన్ జట్టు ఈ విజయంతో చరిత్ర సృష్టించింది. క్రికెట్ లో సరికొత్త రికార్డు కూడా నమోదు చేసింది. ఇలా పాక్ జట్టుకు ఎదురుదెబ్బ తగలడంతో ఈ విషయం కాస్త క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ మ్యాచ్ లో ఏం జరిగింది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పాక్ జట్టుకు ఆఫ్గానిస్థాన్ అదిరిపోయే షాక్ ఇచ్చింది. షార్జా వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20లో ఆరు వికెట్ల తేడాతో పాక్ ని చిత్తుచిత్తుగా ఓడించింది. సీనియర్ క్రికెటర్లు బాబర్, రిజ్వాన్ తదితరులు లేకపోవడం ఈ మ్యాచ్ లో చాలా స్పష్టంగా కనిపించింది. షాదాబ్ ఖాన్ కెప్టెన్సీ చేశాడు కానీ గెలవడానికి అది ఏ మాత్రం సరిపోలేదు. మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 92 పరుగులు మాత్రమే చేయగలిగింది. అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్న అఫ్గాన్ జట్టు.. పాక్ బ్యాటర్లని పూర్తిగా కట్టడి చేసి పడేసింది. షాదాబ్ ఖాన్ అత్యధికంగా 23 పరుగులు చేశాడు.
ఇక 93 పరుగులతో ఛేదన ప్రారంభించిన అఫ్గాన్ జట్టు.. 17.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి దాన్ని పూర్తి చేసింది. మహ్మద్ నబీ 38 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్ ని గెలిపించాడు. ఇదిలా ఉండగా.. టీ20ల్లో పాక్ పై అఫ్గాన్ జట్టుకు ఇదే తొలి గెలుపు కావడం విశేషం. ఇన్నిరోజులు తమ జట్టు టీ20ల్లో టాప్ అని అనుకుంటున్న పాక్ కు ఈ ఓటమి ఎదురుదెబ్బే అని చెప్పాలి. మరోవైపు ఈ విజయంతో ఆత్మవిశ్వాసం పెంచుకున్న అఫ్గాన్ జట్టు.. రెండో టీ20లోనూ అదరగొట్టేయాలని ప్లాన్ వేసుకుంటోంది. ఒకవేళ ఇందులోనూ గెలిస్తే మాత్రం ఏకంగా సిరీస్ సొంతమవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో? అఫ్గాన్ చేతిలో పాక్ ఘోరంగా ఓడిపోవడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
🎉 𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐘 𝐌𝐀𝐃𝐄 𝐢𝐧 𝐒𝐇𝐀𝐑𝐉𝐀𝐇! 🏏
Congratulations to Afghanistan on a fantastic first-ever international victory over @TheRealPCB! 🤩👏👌💪
Congratulations to the entire Afghan Nation! Many more to come…! 💯🔥#AfghanAtalan | #AFGvPAK | #LobaBaRangRawri pic.twitter.com/wWmfriv4DZ
— Afghanistan Cricket Board (@ACBofficials) March 24, 2023