టీ20 వరల్డ్ కప్ 2022 సమరానికి మరికొన్ని రోజుల్లో టాస్ పడనుంది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ ప్రతిష్టత్మక టోర్నీకి అన్ని జట్లు సంసిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే దాదాపు అన్ని బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. వరల్డ్ కప్ విజయంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ వరల్డ్ కప్ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చే అవకాశం ఉన్న టాప్ 5 ఆటగాళ్లను ప్రకటించాడు. ఈ లిస్ట్‌లో టీమిండియా నుంచి స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఒక్కడికే చోటు దక్కడం గమనార్హం. విచిత్రంగా టీ20 పార్మాట్‌లో ప్రస్తుతం ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్‌కు గిల్‌క్రిస్ట్ టాప్ ఫైవ్‌లో చోటిచ్చాడు.
గిల్‌క్రిస్ట్ ప్రకటించిన టాప్ ఐదుగురి ఆటగాళ్ల లిస్ట్‌లో తొలి స్థానం ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు కట్టబెట్టాడు. కాగా.. వార్నర్ గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 146.70 స్ట్రైక్ రేట్‌తో మూడు హాఫ్ సెంచరీల చేసి ఆసీస్ వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక రెండో స్థానం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్‌కు ఇచ్చాడు. బాబర్ అన్ని కండీషన్లలో బ్యాటింగ్ అద్భుతంగా చేయగలడని.. వరల్డ్ కప్‌లో అతను మంచి ప్రదర్శన చేస్తాడని ఆశిస్తున్నట్లు గిల్‌క్రిస్ట్ వెల్లడించాడు. మూడో స్థానంలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు చోటిచ్చాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో పాండ్యా బెస్ట్ అంటూ గిల్‌క్రిస్ట్ కితాబిచ్చాడు.
ఇక నాలుగో స్థానంలో అఫ్ఘనిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్, స్పిన్ మేజిషియన్ రషీద్ ఖాన్‌ను తీసుకున్నాడు. కొన్నేళ్లుగా టీ20ల్లో రషీద్ ఖాన్ హవా నడుస్తుందని.. టీ20 వరల్డ్ కప్‌లోనూ రషీద్ ఖాన్ డేంజరస్‌గా ఉంటాడని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు. ఐదో స్థానం ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్‌కు ఇచ్చాడు. ఐపీఎల్ 2022లో బట్లర్ సెంచరీల మోత మోగించిన విషయం తెలిసిందే. ఇక టీ20 వరల్డ్ కప్‌లోనూ బట్లర్ ఇంగ్లండ్ జట్టులో కీ ప్లేయర్‌గా ఉంటాడని అందులో ఎలాంటి సందేహం లేదని గిల్‌క్రిస్ట్ అన్నాడు. ఈ టాప్ ఫైవ్‌లో టీమిండియా నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. మరీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సూపర్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్న మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌ను కూడా గిల్‌క్రిస్ట్ టాప్ ఫైవ్‌లో కన్సిడర్ చేయకపోవడంపై క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Adam Gilchrist’s first five dream T20I XI picks are here. Your first five?🤔 (via ICC)#INDvSA | @davidwarner31 | @babarazam258 | @hardikpandya7 | @rashidkhan_19 | @josbuttler pic.twitter.com/ZxGx4QGAPl
— CricTracker (@Cricketracker) October 3, 2022
ఇది కూడా చదవండి: రోహిత్ శర్మ టాలెంట్‌ను 13 ఏళ్ల క్రితమే గుర్తించిన ఆస్ట్రేలియా దిగ్గజం