వైజాగ్ లో జరుగుతున్న ఇండియా వర్సెస్ ఆసీస్ మ్యాచ్ లో కామెంటేటర్ గా సందడి చేశాడు హీరో నాని. సునీల్ గవాస్కర్, ఆరోన్ ఫించ్ లతో కలిసి వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
ఇండియాలో సినిమాలకు, క్రికెట్ కు ఉన్న ఫ్యాన్స్ మరే ఇతర ఆటలకు లేరనే చెప్పాలి. మరోవైపు ఇప్పటికే ఎంతో మంది ఆటగాళ్ల జీవిత చరిత్రలు వెండితెరపై సందడి చేశాయి. అదీకాక ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్లు సైతం కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కొన్ని నెలల క్రితం విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. ఈ సినిమా ప్రమోషన్స్ జరుగుతున్న సమయంలో ఇండియా-పాక్ మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో ఈ మ్యాచ్ ద్వారా తన చిత్రాన్ని ప్రమోట్ చేసుకున్నాడు ఈ రౌడీ హీరో. తాజాగా మరోహీరో తన సినిమా ప్రమోషన్స్ కోసం తాజాగా జరుగుతున్న ఇండియా-ఆసీస్ మ్యాచ్ లో మెరిశాడు. హీరో నాని గత కొన్ని రోజులుగా దసరా సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నాడు. ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతున్న ఇండియా వర్సెస్ ఆసీస్ మ్యాచ్ లో కామెంటేటర్ గా సందడి చేశాడు. సునీల్ గవాస్కర్, ఆరోన్ ఫించ్ లతో కలిసి వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు.
వైజాగ్ వేదికగా ఇండియా-ఆసీస్ మధ్య రెండో వన్డే జరుగుతోంది. వాతావరణ కారణంగా మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనుమానం ఉంది. కానీ వర్షం లేకపోవడంతో.. మ్యాచ్ ప్రారంభం అయ్యింది. ఇక ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని గ్రౌండ్ లో సందడి చేశాడు. సునీల్ గవాస్కర్, ఆరోన్ ఫించ్, లేడీ కామెంటేటర్ తో ముచ్చట్లు పెట్టాడు. వారు అడిగే ప్రశ్నలకు సమధానాలు ఇస్తూ.. బ్యాట్ తో రకరకాల షాట్స్ కు పోజులు ఇచ్చాడు. అయితే మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతున్న దసరా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాని ఈ మ్యాచ్ కు వచ్చాడు. దసరా మూవీ మార్చ్ 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేశాయి.
ఇక గ్రౌండ్ లో క్రికెట్ తో తనకు ఉన్న అనుబంధాన్ని కామెంటేటర్స్ తో పంచుకున్నాడు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ.. చాలా సేపు అక్కడ సందడి చేశాడు. ఇక సచిన్ టెండుల్కర్ తన ఆల్ టైమ్ ఫేవరెట్ ప్లేయర్ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న ప్లేయర్స్ ను తన సినిమాలతో పోల్చాడు. పాండ్యాను పిల్లజమిందార్ అని, రోహిత్ ను జెంటిల్ మెన్ అని, విరాట్ ను గ్యాంగ్ లీడర్ అంటూ వారికి సూట్ అయ్యే విధంగా పేర్లు చెప్పాడు. ఈ మ్యాచ్ కు భారీ ఎత్తున అభిమానులు హాజరైయ్యారు. ఇక గ్రౌండ్ లో మ్యాచ్ చూడ్డానికి వచ్చిన వారికి నాని కూడా కనిపించడంతో.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు.