ఆసియా కప్2022 ఫైనల్ లో శ్రీలంక గెలవబోతోందా? ఆరోసారి విజేతగా నిలవనుందా? ఆసియా ఖండంలో చాంపియన్ గా రాజ్యాన్ని ఏలనుందా? అంటే.. అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు.. సరైన కారణాన్నే ఉదాహరణగా చూపుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. 15వ ఎడిషన్ ఆసియా కప్ టోర్నీ ముగింపుకు మరొక్క రోజు మాత్రమే మిగిలింది. దుబాయి వేదికగా సెప్టెంబర్ 11న జరగబోయే.. పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక సమరంతో టోర్నీ ముగియనుంది. ఈ క్రమంలో ఇలాంటి వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
వరల్డ్ కప్ అంత కాకపోయినా.. ఆసియా ఖండంలో చాంపియన్ గా రాజ్యాన్ని ఏలే అవకాశం ఆసియా కప్ ద్వారా ఉంటుంది. అందుకే.. అన్ని జట్లు విజేతగా నిలవాలని కోరుకుంటాయి. అలా ఎన్నో అంచనాల మధ్య ఫెవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా సూపర్-4 దశలోనే వెనుదిరగగా, ప్రభావం చూపిస్తుందనుకున్న బంగ్లాదేశ్.. పసికూన హాంకాంగ్ కంటే దారుణంగా ఆడి లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది.పోనీ, అగ్రశ్రేణి జట్లకు షాకిస్తుందనుకున్న ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే దారిలో మరోసారి నడిచింది. ఇప్పుడు మిగిలిందల్లా ఫైనల్ పోరు. సెప్టెంబర్ 11న దుబాయి వేదికగా పాకిస్తాన్, శ్రీలంక మధ్య ఆఖరి సమరం జరగనుంది. అయితే.. ఫైనల్ లో శ్రీలంక విజేతగా నిలవనుందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Asia Cup final Pakistan vs srilanka
On sep 11 who will win ?? Comment below #PAKvSL #PakistanCricket #srilank pic.twitter.com/FyASwScRxb— Santhosh Santhu (@ssantu2003) September 9, 2022
శ్రీలంక వేదికగా 15వ ఎడిషన్ ఆసియా కప్ టోర్నీ జరగాల్సి ఉండేది. అయితే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంక ఆసియా కప్ ను నిర్వహించలేమని చెప్పేసింది. దీంతో ఆఖరి నిమిషంలో ఆసియా కప్ వేదికను శ్రీలంక నుంచి యూఏఈకి మార్చారు. అందులోనూ.. గత కొన్ని నెలలుగా శ్రీలంకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. రాజకీయ నాయకుల అవినీతి కారణంగా ఆర్థిక సంక్షోభయంతో కొట్టిమిట్టాడుతోంది. ఈ క్రమంలో లంక టూరిజం బాగా దెబ్బతిని ఆర్థిక సంక్షోభ సమస్య మరింత ముదిరిపోయింది. ఈ క్రమంలో లంక పరిస్థితిని అర్థం చేసుకున్న ఏసీసీ.. లంకను ఆసియాకప్ గెలిచేలా ప్రోత్సహించిందని ఊహాగానాలు వస్తున్నాయి. ఈసారి శ్రీలంక ఆసియాకప్ ను కైవసం చేసుకుంటే లంక బోర్డుకు పెద్ద మొత్తంలో అందనున్నట్లు సమాచారం.
Impunity for human rights violations and economic crimes is an underlying cause of #SriLanka’s economic crisis, a report by the @UN_HRC said, calling for accountability and deeper institutional reforms to prevent a recurrence of past violations.#LKA https://t.co/XOa9vZXT8O pic.twitter.com/mEV5b0xwOW
— EconomyNext (@Economynext) September 7, 2022
ఇవన్నీ నిజమే అనుకున్నా.. ఆట పరంగా ఆసియా కప్ లో శ్రీలంక పుంజుకున్న తీరు అద్భుతమనే చెప్పాలి. టోర్నీ తొలి మ్యాచులో అఫ్గనిస్తాన్ చేతిలో దారుణ ఓటమి చవిచూసిన శ్రీలంక.. ఆ తర్వాత అద్భుత విజయాలు అందుకొని ఫైనల్ కు చేరింది. మరోవైపు పాకిస్తాన్ కూడా మూడోసారి ఆసియాకప్ ను సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. అయితే.. ఆసియాకప్ ను లంక గెలిచినా.. గెలవకపోయినా ఏసీసీ(ఆసియా క్రికెట్ కౌన్సిల్) లంక బోర్డుకు ప్రత్యేక నగదు బహుమతిని అందించాలని ముందే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఆసియా కప్ ను అత్యధికంగా భారత్ ఏడుసార్లు గెలవగా.. శ్రీలంక ఐదుసార్లు, పాకిస్తాన్ రెండుసార్లు టైటిల్స్ అందుకున్నాయి. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.