రికార్డుల రారాజుగా, పరుగుల యంత్రంగా పేరుగాంచిన కోహ్లీ కెరీర్‌లో లెక్కలేనన్నీ రికార్డులు. ఇది గతం. గడిచిన రెండు, మూడేళ్లుగా ఈ రన్ మెషీన్ నుంచి పరుగులు రావడం గగనంగా మారిపోయింది. అతడి బ్యాట్ నుంచి సెంచరీ చూసి ఎన్నాళ్లయిందో తెలుసా? వెయ్యి రోజులు గడిచిపోయాయి. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీ ఇంటాబయట విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ విమర్శలన్నింటికీ ఆసియా కప్ టోర్నీలోనైనా సమాధానం చెప్తాడనుకుంటే.. ఇక్కడా అదే ఆట. ఈ తరుణంలో కోహ్లీ పొట్టి క్రికెట్‌కు త్వరలోనే గుడ్ బై చెప్పనున్నాడనే వార్త హల్ చల్ చేస్తోంది.
చిరుతులా పరుగెత్తడం.. సింహంలా గర్జించడం. ఒకప్పుడు మైదానంలో కోహ్లీ కనిపించే తీరు ఇది. కానీ, ఇప్పుడు కనిపిస్తున్న కోహ్లీ వేరు. పరుగులు లేక ఒత్తిడిలో కూరుకుపోయాడు. 33 ఏండ్ల కోహ్లీ ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో ఫామ్ కోల్పోయి తంటాలుపడుతున్న కోహ్లీకి కాస్త విశ్రాంతి కల్పించాలని బీసీసీఐ ఆలోచిస్తుందట. ముఖ్యంగా టీ20ల నుంచి శాశ్వతంగా పంపించేందుకు బీసీసీఐ రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోందట. అయితే.. అదీ కోహ్లీతో చర్చించాకే నట!
Even in his worst phase of life, that too didn’t touch bat for last 1 month still highest scorer for Team India in crucial game, That’s VIRAT KOHLI for you.
Well played King ❤️💯#ViratKohli𓃵 #INDvsPAK
BAAP BAAP HOTA HAI pic.twitter.com/866aLKqa0p
— Avnii (@Opinion_point_) August 28, 2022
ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ పొట్టి ఫార్మాట్‌లో కొనసాగుతాడా..? లేదా..? అన్నది తేలనుంది. ఈ మేరకు సెలక్షన్ కమిటీ కూడా కోహ్లీతో చర్చించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు బీసీసీఐ వర్గాల సమాచారం. కోహ్లీ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ రక మూడేళ్లు గడిచిపోయాయి. టెస్టు క్రికెట్‌తో పాటు పొట్టి ఫార్మాట్‌లోనూ కోహ్లీ ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. కోహ్లీ నుంచి 20, 30 లను కోరుకోవడం లేదు. అది అతడి స్థాయిని తగ్గించడమే. అదీగాక స్ట్రైక్ రేట్ కూడా నానాటికీ దారుణంగా పడిపోతోంది. ఈ తరుణంలో ఇదే సరైన నిర్ణయమని విమర్శకుల వాదన.
Being this man’s trusted deputy was the most enjoyable and exciting period in my career. Our partnerships would always be special to me forever. 7+18 ❤️ pic.twitter.com/PafGRkMH0Y
— Virat Kohli (@imVkohli) August 25, 2022
అయితే.. ఇప్పటికిప్పుడు కోహ్లీని తప్పిస్తే అది అతడితో పాటు జట్టుకూ చాలా నష్టం చేకూర్చే అవకాశం ఉంది. అందుకే సెలక్టర్లు పొట్టి ప్రపంచకప్ వరకు వేచి చూస్తున్నారట. అది ముగిశాక కోహ్లీతో సమావేశమై.. ఈ ఫార్మాట్‌లో అతడిని ఆడించాలా..? లేదా..? అన్నది విషయమై అతడితోనే చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ సమాచారం కోహ్లీకి తెలియనది కాదు. ఇకనైనా కోహ్లీ చెలరేగి ఆడాలి అన్నది అభిమానుల కోరిక. చూద్దాం.. అన్ని ఫార్మాట్లలో ఆడతాడా..? లేక ఏదో ఒక్క ఫార్మాట్‌కే పరిమితమవుతాడా..? అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat kohli’s ball by ball highlights vs Pakistan in Asia cup 2022.⏩⏩⏩
Part 1: pic.twitter.com/or7tZtzNTk— Shrey Ambhore (@imShrey1817) August 30, 2022