ఆసియా కప్ ఎక్కడ జరగాలో ఎట్టకేలకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ తేల్చేసింది. ఆసియా కప్ 2023ను పాకిస్థాన్‌లోనే నిర్వహిస్తామని ఏసీసీ ప్రకటించినా.. బీసీసీఐ సైతం తన పంతం నెగ్గించుకుంది.
ఆసియా కప్ 2023 ఎక్కడ జరుగుతుంది? పాకిస్థాన్‌లోనే జరగాలని పీసీబీ పట్టుబడితే.. అక్కడికి వెళ్లే ఉద్దేశం తమకు లేదని బీసీసీఐ తేల్చి చెప్పేసింది. ఆసియా కప్ పాక్‌లో జరగకపోతే ఆదాయపరంగా పీసీబీకి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా, కొన్ని రాజకీయ కారణాల వలన టీమిండియా.. పాక్ లో పర్యటించలేని పరిస్థితి. దీంతో గత కొన్ని నెలలుగా ఆసియా కప్ ఎక్కడ నిర్వహించాలనే అంశంపై చర్చ జరుగుతూనే వస్తుంది. ఈ విషయంలో ఏసీసీ(ఆసియన్ క్రికెట్ కౌన్సిల్)ఈ మెగా టోర్నీని ఎక్కడ నిర్వహించాలో తేల్చుకోలేక చాలానే ఇబ్బంది పడింది. కానీ ఎట్టకేలకు ఈ విషయంలో సస్పెన్స్ కి తెరపడింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్ 2023ను పాకిస్థాన్ లోనే నిర్వహిస్తున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధికారికంగా వెల్లడించింది.
అయితే.. భారత్-పాక్ మధ్య మ్యాచ్‌ల విషయంలో ఏసీసీ ఇరుజట్ల మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నించింది. ఇందులో భాగంగా నిన్న గురువారం పీసీసీ, బీసీసీఐ లతో సమావేశం నిర్వహించింది. దీని ప్రకారం 2023 ఆసియా కప్ పాకిస్థాన్ లోనే జరుగుతుందని.. అయితే భారత్ ఆడబోయే మ్యాచులు మాత్రం తటస్థ వేదికల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. దీంతో అటు పాక్ క్రికెట్ బోర్డు, ఇటు భారత క్రికెట్ బోర్డు ఈ విషయంలో తమ అంగీకారాన్ని తెలిపాయి. అయితే భారత్ తటస్థ వేదికలపై ఆడడం కన్ఫర్మ్ అయినప్పటికీ..ఏ దేశంలో ఆడుతుందందనేది తెలియాల్సి ఉంది. దుబాయ్, శ్రీలంక, ఇంగ్లండ్, ఒమన్ దేశాలు పరిశీలనలో ఉన్నాయి. వీటిలో ఒకదాన్ని ఫైనల్ చేయనున్నారు. ఒక వేళ భారత్ ఆసియ కప్ ఫైనల్ కి వస్తే.. ఫైనల్ కూడా తటస్థ వేదికలపై నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. ఇందుకు పాక్ క్రికెట్ బోర్డు కూడా అంగీకరించినట్లు ఏసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇక ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉండడంతో.. వన్డే ఫార్మాట్ లోనే ఆసియా కప్ నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. గతేడాది ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ లో జరగనున్న ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, క్వాలిఫైయర్ లు ఒక గ్రూపులో ఉండగా.. శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ మరో గ్రూప్ లో ఉన్నాయి. మొత్తం 13 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో ఒక్కొక్క గ్రూప్ నుంచి టాప్ 2లో ఉన్న జట్లు సెమీ ఫైనల్ కి అర్హత సాధిస్తాయి. మొత్తానికి ఆసియా కప్ నిర్వహణ విషయంలో భారత్ తగ్గేదే లేదు అని తన పంతం నెగ్గించుకుంటే.. పీసీబీ మాత్రం కాస్త వెనక్కి తగ్గినట్టే కనిపిస్తుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలుపండి.
India could play their matches at the 2023 Asia Cup, set to be hosted by Pakistan, outside Pakistan https://t.co/M3v1uQPlGu pic.twitter.com/nWASWUdazi
— ESPNcricinfo (@ESPNcricinfo) March 23, 2023