టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్, ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ నుండి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. సెప్టెంబర్ 2022లో మిగిలిన అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు. అయినప్పటికీ అతడంటే అభిమానులకు ఇప్పటికీ ఇష్టమే. అందుకు కారణం.. ఐపీఎల్. ‘చిన్న తలా’గా పేరొందిన రైనా చెన్నై సూపర్ కింగ్స్ కు ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు. రైనా బ్యాటర్ మాత్రమే కాదు.. బెస్ట్ పార్ట్ టైం స్పిన్నర్. బెస్ట్ ఫీల్డింగ్ కూడాను.
రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాక విదేశీ లీగ్‌లలో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం అబుదాబిలో టీ20 లీగ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్ తరుపున ఆడుగుతున్నాడు. తాజాగా, అబుధాబీ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 2 బంతులు ఎదుర్కొన్న రైనా డకౌట్ గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ అనంతరం రైనా.. సమర్థవంతమైన నాక్‌తో రీఎంట్రీ చేస్తానంటూ ప్రతిజ్ఞ చేశాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెటర్ ఆజాం ఖాన్ తో ఫోటోలు దిగాడు. ఈ ఫోటోలను ఆజాం ఖాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్ గా మారాయి.
🇮🇳🤝🇵🇰@ImRaina pic.twitter.com/bTGf9z7YSv
— Azam Khan (@MAzamKhan45) November 25, 2022
సురేష్ రైనా 13 ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 5,615 పరుగులు చేసిన రైనా టీ20ల్లో 1,605 రన్స్, టెస్టుల్లో 768 పరుగులు సాధించాడు. రైనా దేశవాలీ క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ లోనూ సత్తా చాటాడు. మొత్తం 205 మ్యాచ్‌లాడిన రైనా.. 32.51 సగటు, 136.76 స్ట్రైక్ రేట్‌తో 5,528 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో శతకం బాదిన కొద్దిమంది భారత ఆటగాళ్లలో రైనా ఒకడు. ఐపీఎల్ లో ఓ శతకం, 39 అర్ధ శతకాలు చేశాడు.
Deccan Gladiators WIN! 🙌
A professional display with bat & bowl gets The Gladiators off to the perfect start in Season 6 🏏
Are they favourites to be crowned champions this year? 🏆 #AbuDhabiCricket #InAbuDhabi #CricketsFastestFormat pic.twitter.com/yh6GCR4MDI
— T10 League (@T10League) November 23, 2022