ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్‌ల్లో కేవలం 6 విజయాలు సాధించి 8 మ్యాచ్‌ల్లో ఓడి.. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. దీంతో ఐపీఎల్ 2023 సీజన్‌లో ఎలాగైన సత్తా చాటాలని ఆ జట్టు యాజమాన్యం గట్టి పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్లే.. ఐపీఎల్ 2023 కోసం ఇప్పటి నుంచే పగడ్బంధి ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. తాజా రిటేషన్ విధానంలో పలువురు ఆటగాళ్లను రిలీజ్ చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో పాటు రూ.10 కోట్లకు పైగా ధరపెట్టి కొన్ని విండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్‌ను సైతం వదిలించుకుంది. యువ క్రికెటర్లను అంటిపెట్టుకుని.. ఐపీఎల్ 2023 మినీ వేలంలో జట్టును మరింత పటిష్టం చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో యువ క్రికెటర్, ఆ జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మను సైతం సన్‌రైజర్స్ యాజమాన్యం రిటేన్ చేసుకుంది.
తనపై సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ.. అభిషేక్ శర్మ దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్నాడు. ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీలో సోమవారం కర్నాటకతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో కర్నాటక కెప్టెన్ టాస్ గెలిచి తొలుత పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ప్రభసిమ్రాన్ సింగ్- అభిషేక్ శర్మ జోడి పంజాబ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ప్రభసిమ్రాన్ సింగ్ తొలి బంతికే గోల్డెన్ డక్ కాగా.. మరికొద్ది సేపటికే వన్‌డౌన్ బ్యాటర్ అన్మోల్‌ప్రీత్ సింగ్ సైతం 4 పరుగులు మాత్రం చేసి అవుట్ అయ్యాడు. ఆ వెంటనే పంజాబ్ కెప్టెన్ మన్‌దీప్ సింగ్ కూడా 6 పరుగులు చేసి అవుట్ కావడంతో పంజాబ్ 34 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో అభిషేక్ శర్మ.. అన్మోల్ మల్హోత్రాతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పి పంజాబ్‌ను గట్టేక్కించాడు.
మొత్తం మీద 123 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సులతో 109 పరుగులు చేసి.. పంజాబ్ ఇన్నింగ్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు అభిషేక్ శర్మ. అతని ఇన్నింగ్స్‌తో పంజాబ్ నిర్ణీత 50 ఓవర్లలో 235 పరుగులు చేయగలిగింది. ఇక అభిషేక్ శర్మ ఆడిన ఇన్నింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌తో పాటు.. ఆ జట్టు మేనేజ్‌మెంట్ సైతం ఫుల్ ఖుషీగా ఉంది. ఐపీఎల్ 2022లో ఎస్‌ఆర్‌హెచ్ తరఫున ఓపెనర్‌గా ఆడిన అభిషేక్ శర్మ పర్వాలేదనిపించాడు. 2018లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ శర్మ.. తొలుత ఢిల్లీ తరఫున ఆడాడు. ఆ తర్వాత 2019 నుంచి 2021 వరకు కేవలం 55 లక్షలకే సన్‌రైజర్స్ తరఫున ఆడాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో అభిషేక్‌కు భారీ ధర దక్కింది. వేలంలో ఏకంగా రూ.6.5 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాదే మళ్లీ దక్కించుకుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 426 పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు.
Fantastic knock from 22-year-old Abhishek Sharma in the Vijay Hazare Quarter-final, 109 runs from 123 balls against Karnataka.
No one other than Abhishek scored more than 10 runs in Punjab Top 4. pic.twitter.com/ZawSewGQ5P
— Johns. (@CricCrazyJohns) November 28, 2022
Every situation needs a hero 💪
Just when Punjab were struggling at 34/3, Abhi decided to step up and show what he is made of in a must-win encounter for Punjab 💥#VijayHazareTrophy #OrangeArmy pic.twitter.com/y6XwSZwEZt
— SunRisers Hyderabad (@SunRisers) November 28, 2022