హ్యాట్రిక్ డకౌట్. సూర్యకుమార్ వల్ల ఈ మధ్య ఇది బాగా వినిపించింది. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో పాక్ క్రికెటర్ చేరాడు. అతడి పరిస్థితి అయితే సూర్య కంటే దారుణంగా ఉంది.
క్రికెట్ లో కొన్నిసార్లు చిత్ర విచిత్రమైనవి జరుగుతూ ఉంటాయి. సూర్యకుమార్ యాదవ్ నే తీసుకోండి. టీ20ల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసే ఇతడు.. వన్డేల్లో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఎంతలా అంటే తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో మూడు మ్యాచుల్లోనూ డకౌట్ అయ్యాడు. దీంతో ప్రతిఒక్కరూ సూర్యని విమర్శించారు. కొందరైతే జట్టు నుంచి వేరే వాళ్లకు అవకాశాలు ఇవ్వొచ్చు కదా అని అంటున్నారు. ఇప్పటివరకు మన సూర్య దురదృష్టం గురించి మాట్లాడుకున్నాం కదా! పాక్ జట్టులో ఓ బ్యాటర్ ఉన్నాడు. సూర్య కంటే దారుణంగా డకౌట్స్ అవుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్ జట్టు ఆటతీరు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓడిపోతుంది అనుకున్న మ్యాచుల్ని ఈజీగా గెలిచేస్తూ ఉంటుంది. అదే ఇలాంటి జట్టుపై అస్సలు ఓడిపోరు అనుకున్న మ్యాచుల్లో కనీసం పోరాటం చేయకుండా ఓటమి పాలవుతూ ఉంటుంది. తాజాగా షార్జాలో జరిగిన తొలి టీ20లో అప్గానిస్థాన్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. కనీసం 100 పరుగులైనా చేయకుండానే ఆలౌటైపోయింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన అఫ్గాన్ జట్టు.. ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని పూర్తి చేసింది. అయితే ఇదే మ్యాచులో పాక్ వన్ డౌన్ బ్యాటర్ అబ్దుల్లా షఫీక్ డకౌట్ అయ్యాడు. కానీ ఇది పెద్ద న్యూస్ అయిపోయింది.
అబ్దుల్లా షఫీక్.. పాక్ తరఫున ఆడింది ఇప్పటివరకు ఆడింది నాలుగు టీ20లే. వాటిలో మూడుసార్లు డకౌట్ అయిపోయాడు. తాజాగా అఫ్గాన్ మ్యాచ్, అంతకు ముందు న్యూజిలాండ్ తో రెండు టీ20ల్లోనూ డకౌట్ అయ్యాడు. దీంతో డకౌట్స్ లో హ్యాట్రిక్ కొట్టనట్లు అయింది. ఈ క్రమంలోనే ఇతడిని తెగ విమర్శిస్తున్నారు. ‘వీడేంట్రా మరీ సూర్య కంటే దారుణంగా ఔటైపోతున్నాడు’ అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి సూర్య కంటే ఎక్కువగా డకౌట్స్ అవుతున్న పాక్ బ్యాటర్ అబ్దుల షఫీక్ దురదృష్టంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Abdullah Shafiq following footprints of Surya Kumar Yadev with 3 ducks in a row….! pic.twitter.com/Ly4oopMKXL
— cricket 786 Pakistan (@Danisha056) March 25, 2023