చివరిసారిగా 2016లో పాకిస్థాన్.. భారత్ లో అడుగుపెట్టింది. అయితే ఈ ఏడాది భారత్ లో వరల్డ్ కప్ నిర్వహించనుండడంతో మరోసారి పాకిస్థాన్ భారత్ కి రాబోతుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ ఇండియా- పాకిస్థాన్ ద్వైపాక్షిక మ్యాచుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసాడు.
ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎప్పటికీ ప్రత్యేకమే. ఇప్పుడైతే ఎప్పుడో వరల్డ్ కప్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి కానీ ఒకప్పుడైతే ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతూ అభిమానులకు మంచి కిక్ ఇచ్చేవి. ఇక వరల్డ్ కప్ వస్తే ఈ రెండు జట్ల మ్యాచ్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. అయితే దాదాపు 15 ఏళ్లుగా ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఆసియా కప్, ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు తలబడుతున్నాయి. అయితే మరో మూడు నెలల్లో ఆసియా కప్, వరల్డ్ కప్ ఉండడంతో దాయాదుల మధ్య పోరు చూసే అవకాశం అభిమానులకి దక్కనుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ ఇండియా- పాకిస్థాన్ ద్వైపాక్షిక మ్యాచుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇండియన్ క్రికెట్ టీంకి పాకిస్థాన్ తో మ్యాచులంటే భయం అని చెప్పుకొచ్చాడు.
చివరిసారిగా 2016లో పాకిస్థాన్ భారత్ లో అడుగుపెట్టింది. అయితే ఈ ఏడాది భారత్ లో వరల్డ్ కప్ నిర్వహించనుండడంతో మరోసారి పాకిస్థాన్ భారత్ కి రాబోతుంది. కానీ ఇక్కడే చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది. వరల్డ్ కప్ కి ముందు టీమిండియా ఆసియా కప్ లాంటి మరో మెగా టోర్నమెంట్ ఆడాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ 2023 టోర్నీ పాకిస్తాన్‌తో జరగాల్సి ఉంది. అయితే ఇండియా, పాకిస్తాన్‌లో పర్యటించేందుకు అంగీకరించకపోవడంతో హైబ్రిడ్ మోడల్ అనే కొత్త కాన్సెప్ట్ ని తీసుకొని వచ్చింది పాకిస్థాన్. అయితే ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ కాబోయే క్రికెట్ చైర్మన్ జకా అస్రఫ్ కి అస్సలు నచ్చడం లేదు. ఈ హైబ్రిడ్ మోడల్ వలన పెద్దగా పాక్ కి ఒరిగేదేమీ లేదు అని తెలిపాడు.భారత్ పాకిస్థాన్ లో పర్యటించకోపోతే పాకిస్థాన్ వరల్డ్ కప్ ఆడేందుకు భారత్ కి పంపే ప్రసక్తే లేదని చెప్పాడు.
ఈ విషయంపై రజాక్ స్పందిస్తూ “ఆసియా కప్ 2023 టోర్నీలో అదే మ్యాచులన్నీ తటస్థ వేదిక శ్రీలంకలో నిర్వహించేలా ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. భారత్ పాక్ చేతిలో ఓడిపోతుందని భయంతోనే సిరీస్ ఆడేందుకు ఇష్టపడడం లేదు. ఒకప్పుడు ఇండియా పాకిస్థాన్ మధ్య స్నేహం ఉండేది. ఇప్పుడున్న టీముల్లో భారత జట్టు ఒక్కటే, పాకిస్తాన్‌తో సిరీస్‌లు ఆడడం లేదు. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు పటిష్టంగా ఉందనే కారణంతోనే వెనక్కి అడుగు వేస్తుంది. గతంలో మాతో మ్యాచులు జరిగినప్పుడు భారత్ పై మేమే ఆధిపత్యం చూపించేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. 2023లో ఉన్నాం. ఇప్పుడు బలమైన, బలహీనమైన జట్టు అంటూ ఏమి లేదు. ఆ రోజు ఏది బాగా ఆడితే ఆ జట్టే గెలుస్తుంది. యాషెస్ లో ఏ జట్టు బలమైన జట్టుతో చెప్పగలమా ? భారత్- పాకిస్థాన్ మ్యాచ్ కూడా అలాంటిదే అని చెప్పుకొచ్చాడు”. ఈ మాజీ పాక్ ఆల్ రౌండర్. మరి భారత్ పాక్ పై సిరీస్ ఆడుతుంది అనే రజాక్ కామెంట్లు మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.