టీమిండియా ప్రధాన బౌలర్ల యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రాను పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాన్ ఘోరంగా అవమానించాడు. పాకిస్థాన్ యువ పేసర్ షాహిన్ షా అఫ్రిదీ ముందు బుమ్రా ఓ బేబీ బౌలర్ అని.. అతని ముందు బుమ్రా ఎందుకూ పనికి రాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలతో భారత క్రికెట్ అభిమానులు రజాక్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇక సీనియర్ క్రికెటర్ అయి ఉండి.. ఇద్దరు క్రికెటర్లను పోల్చుతూ.. ఒకరి అవమానిస్తూ.. వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు. అయినా.. వివాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలవడం పాక్ క్రికెటర్లకు వెన్నతో పెట్టిన విద్య అంటూ మరికొంతమంది రజాక్ వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు.
అయితే.. అబ్దుల్ రజాన్ జస్ప్రీత్ బుమ్రాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తొలిసారి కాదు. గతంలో కూడా బుమ్రా ఓ బేబి బౌలర్ అని.. తాను గ్లెన్ మెక్‌గ్రాత్, వసీం అక్రమ్ లాంటి దిగ్గజ బౌలర్లతో కలిసి ఆడానని నా ముందు బుమ్రా ఓ బేబీ బౌలర్ అంటూ కామెంట్ చేశాడు. బుమ్రాను తాను చాలా ఈజీగా ఎదుర్కొగలనని, అతన్ని డామినేట్ చేస్తూ.. ఎటాకింగ్ క్రికెట్ ఆడగలనంటూ పేర్కొన్నాడు. కాగా.. అబ్దుల్ రజాక్ వ్యాఖ్యలపై ఇండియన్ ఫ్యాన్స్ అప్పుడూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడైతే.. సోషల్ మీడియా వేదికగా రజాక్‌పై ట్రోలింగ్‌కు దిగారు. అయితే.. ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా, షాహిన్ షా అఫ్రిదీ ఇద్దరూ గాయాలతో వారివారి జాతీయ జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
బుమ్రా టీ20 వరల్డ్ కప్ 2022 కంటే ముందే తీవ్రంగా గాయపడి టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే. బుమ్రా లేకపోవడం వరల్డ్‌కప్‌లో టీమిండియాకు భారీ దెబ్బ కొట్టింది. బుమ్రా లేని టీమిండియా బౌలింగ్ ఎటాక్ టోర్నీలో దారుణంగా తేలిపోయింది. అయితే.. బుమ్రా ప్రస్తుతం వెన్ను నొప్పి నుంచి మెల్లమెల్లగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ కోసం శ్రమిస్తున్నాడు. అయితే.. బుమ్రాను వన్డే వరల్డ్ కప్‌లో ఒక పదునైన ఆయుధంగా వాడేందుకు.. ఆస్టేలియాతో ఫిబ్రవరీ 9 నుంచి ప్రారంభం కాబోయే నాలుగు టెస్టుల సిరీస్‌కు సైతం బుమ్రాను ఎంపిక చేయలేదు సెలెక్టర్లు. మరి బుమ్రా పరిస్థితి ఇలా ఉంటే.. అతన్ని షాహిన్ అఫ్రిదీతో పోల్చి అబ్దుల్ రజాక్ అవమానకర వ్యాఖ్యలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Abdul razak – Jasprit bumrah is a baby bowler in front of me & i could have easily dominated & attacked him pic.twitter.com/BeMOwXfHqy
— Sarcastic 🇮🇳 (@Gauravbramhane1) December 5, 2019