అంతర్జాతీయ క్రికెట్లో మిస్టర్ 360 గా పేరుగాంచిన డివిల్లియర్స్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఏబీ డివిల్లియర్స్ ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్లో తన ఆల్ టైం టీ20 ఫేవరేట్ క్రికెటర్ ఎవరో చెప్పుకొచ్చాడు. అయితే అందరు అనుకున్నట్లు గా అతడు కోహ్లీ పేరో.. సూర్య కుమార్ పేరో చెప్పలేదు. ఎవరి పేరు చెప్పాడంటే?
స్టార్ క్రికెటర్లకు ఎంత ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి ఆటతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంటారు. సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది క్రికెట్ ప్రేమికులు స్టార్ క్రికెటర్లని అనుసరిస్తూ..ఎప్పుడు వీరిని సపోర్ట్ చేస్తూ ఉంటారు. తమ ఫేవరేట్ ప్లేయర్ సెంచరీ కొట్టినా.. వికెట్లు తీసిన సంబరాలు చేసుకుంటారు. కేవలం సామాన్యులకే కాదు దిగ్గజాలు సైతం కొంతమంది క్రికెటర్లను ఇష్టపడుతుంటారు. వీరి మనసులో ఏ క్రికెటర్ ఉన్నాడో తెలుసుకోవాలని సగటు క్రికెట్ అభిమానులకి ఉంటుంది. తాజాగా ఏబీ డివిల్లియర్స్ ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్లో తన ఆల్ టైం టీ20 ఫేవరేట్ క్రికెటర్ ఎవరో చెప్పుకొచ్చాడు.
అంతర్జాతీయ క్రికెట్లో మిస్టర్ 360 గా పేరుగాంచిన డివిల్లియర్స్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఫార్మాట్ ఏదైనా విధ్వసంకర బ్యాటింగ్ తో వరల్డ్ క్రికెట్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నాడు. ఎవరికీ కూడా సాధ్యం కానీ బ్యాటింగ్ టెక్నీక్ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను డివిల్లియర్స్ సొంతం చేసుకున్నాడు. కేవలం ఆటతోనే కాదు వ్యక్తిగతంగా కూడా అభిమానులని సంపాదించుకోవడంలో డివిల్లియర్స్ ముందు వరుసలో ఉంటాడు. ప్రశంసలకు దగ్గరగా..విమర్శకులకు దూరంగా ఉంటూ తన అభిమానులను మరింతగా పెంచుకున్నాడు. డివిల్లియర్స్ కి మన దేశంలో ఒక స్టార్ క్రికెటర్ కి ఉండే ఫాలోయింగ్ ఉండడం విశేషం. అలాంటి డివిల్లియర్స్ కి ఇష్టమైన క్రికెటర్ ఎవరో తెలుసుకోవాలని యావత్ క్రీడా ప్రపంచానికి ఉంటుంది. డివిల్లియర్స్ ఫేవరేట్ క్రికెటర్ ఎవరో కాదు.. ప్రస్తుతం తన స్పిన్ మాయాజాలంతో ప్రపంచ క్రికెట్ ని వణికిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్.
డివిల్లియర్స్.. రషీద్ ఖాన్ పేరు చెప్పగానే చాలామంది కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. అందరూ డివిల్లియర్స్ ఫేవరేట్ క్రికెట్ ప్లేయర్ ఇప్పటి వరకు చాలామంది టీం ఇండియా రన్ మెషిన్ కోహ్లీనే అనుకున్నారు. కానీ రషీద్ ఖాన్ అని చెప్పడం కోహ్లీ ఫ్యాన్స్ లో కొంత నిరాశ కు లోనయ్యారని తెలుస్తుంది. కోహ్లీ -డివిల్లియర్స్ మధ్య ఎంత మంచి అనుబంధముందో మనందరికీ తెలిసిందే. ఐపీఎల్ ల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీంకి ఈ ఇద్దరు దిగ్గజాలు చాలా కాలం కలిసి ఆడారు. ఒకరి ఆట తీరుని మరొకరు ఇష్టపడుతూ చాలా స్పోర్టివ్ గా ఉండేవారు. అయితే ఇప్పుడు కోహ్లీని కాదని రషీద్ ఖాన్ తన ఫేవరేట్ ప్లేయర్ అని చెప్పడంతో అభిమానులకి కొంచెం కొత్తగా అనిపించింది.
డివిల్లియర్స్ మాట్లాడుతూ.. “రషీద్ ఖాన్ నా ఆల్ టైం గ్రేటెస్ట్ టీ20 ప్లేయర్. అతను బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించగలడు. ఎప్పుడు గెలవాలని కోరుకుంటాడు. మైదానంలో చాలా చురుగ్గా, ధైర్యంగా ఉంటాడు. అతను అత్యుత్తమ టీ20 ఆటగాళ్లలో ఒకడు కాదు. అతడే అత్యుత్తమ టీ20 ఆటగాడు” అని రషీద్ ఖాన్ మీద ప్రశంసల వర్షం కురిపించాడు ఏబీడి. దీంతో తనతో పాటు ఆర్సీబికి ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ లు ఆడిన కోహ్లీ, గేల్ పేర్లు చెప్పకపోవడం గమనార్హం. మరి డివిల్లియర్స్ తన అల్ టైం టీ20 ప్లేయర్ రషీద్ ఖాన్ అని చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.