సౌతాఫ్రికా మాజీ క్రికెటర్, విధ్వంసకర మిస్టర్ 360 ప్లేయర్ ఏబీ డివిలియర్స్ తన అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పాడు. ఐపీఎల్ 2023లో ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించాడు. కాగా.. ఏబీడీకి భారత్‌లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఐపీఎల్‌లో కొన్నేళ్లపాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు ఆడిన డివిలియర్స్.. ఇండియాలో కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆర్సీబీలో విరాట్ కోహ్లీ తర్వాత అంతటి స్టార్‌డమ్ డివిలియర్స్‌కు ఉండేది. అంతర్జాతీయ క్రికెట్‌లో తన పవర్ హిట్టింగ్‌తో మెరుపులు మెరిపించిన డివిలియర్స్ ఐపీఎల్‌లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గ్రౌండ్‌కు అన్ని వైపుల భారీ షాట్లతో విరుచుకుపడుతూ.. మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్‌గా పేరుతెచ్చుకున్నాడు. అలాగే ఆర్సీబీకి ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించాడు.
ఐపీఎల్ ప్రారంభం నుంచి 2021 వరకు ఆడిన డివిలియర్స్.. తన విధ్వంసకర ఆటతో క్రికెట్ అభిమానుల అంతులేని వినోదాన్ని అందించాడు. ఐపీఎల్ 2022లో మాత్రం డివిలియర్స్ ఆటను క్రికెట్ అభిమానులు ఎంతో మిస్ అయ్యారు. అలాగే విరాట్ కోహ్లీతో కూడా ఏబీ డివిలియర్స్‌కి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా.. క్రికెట్‌లో కోహ్లీకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే.. అందరూ డివిలియర్స్ అని వెంటనే చెప్పేస్తారు. వాళ్లిద్దరి మధ్య అంత మంచి బాండింగ్ ఉంది. కాగా.. డివిలియర్స్ కొన్ని రోజుల క్రితం ఇండియా వచ్చాడు. చాలా రోజుల తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన డివిలియర్స్ తొలుత బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియాన్ని సందర్శించాడు. ఆర్సీబీ తరఫున ఆ స్టేడియంలో తను ఆడిన క్షణాలను, అభిమానులు నుంచి పొందిన మద్దతును గుర్తు చేసుకున్నాడు.
ఆ తర్వాత క్రికెట్ గాడ్, దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఏబీడీ.. ముంబై వీధుల్లో పిల్లలతో కలిసి సరదాగా గల్లీ క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌ను టీమిండియా గెలుస్తుందని జోస్యం చెప్పాడు. అలాగే ఐపీఎల్ 2023లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. కానీ.. జట్టులో ఆటగాడిగా కాదులేండి. ఆర్సీబీ తరఫున ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్‌కు హాల్ ఆఫ్ ఫేమ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అరుదైన గౌరవం తమకు ఇవ్వడంపై.. అలాగే ఆర్సీబీ అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఙతలు తెలిపేందుకు ఐపీఎల్ 2023లో ఆర్బీసీ ఆడే తొలి మ్యాచ్‌కు హాజరవుతున్నట్లు డివిలియర్స్ ప్రకటించాడు.
AB de Villiers will be back at Chinnaswamy along with Chris Gayle for the induction into RCB’s hall of fame.@ABdeVilliers17 | @henrygayle | #RCB | #IPL pic.twitter.com/KaNeKhOzcM
— CricTracker (@Cricketracker) November 9, 2022