ఆర్సీబీ.. ఐపీఎల్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న టీమ్. ఒక్కసారి కూడా కప్ కొట్టలేకపోయినా.. ఫ్యాన్ బేస్‌లో నంబర్ వన్ టీమ్. అలాంటి జట్టు మరోసారి ‘ఈ సాలా కప్ నమ్‌దే’ స్లోగన్ ఇచ్చింది. కానీ.. ఫ్యాన్స్ మాత్రం..
మరికొన్ని రోజుల్లోనే ధనాధన్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ ప్రారంభం కానుంది. క్రికెట్ అభిమానులకు రెండున్నర నెలల పాటు నాన్‌స్టాప్ వినోదాన్ని అందించే ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అన్ని జట్లు ఐపీఎల్ 2023 కోసం సిద్ధంగా ఉన్నాయి. ప్రధాన ఆటగాళ్లు సైతం జట్లతో చేరిపోయారు. అన్ని జట్లు తమ తమ జెర్సీలను సైతం లాంచ్ చేశాయి. జట్టులో ఉండే ఆటగాళ్లు, లీగ్‌కు దూరమైన ఆటగాళ్లల లిస్ట్ అంతా దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. ఇక ఈ సారి ఐపీఎల్ టైటిల్ గెలిచే జట్టు ఏదో అనే చర్చ కూడా క్రికెట్ అభిమానుల్లో జరుగుతోంది. తమ టీమ్ గెలుస్తుందంటే.. లేదు మా టీమ్ బలంగా ఉంది.. ఈ సారి కప్ మాదే అంటూ క్రికెట్ ఫ్యాన్స్ వాదించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆర్సీబీ ఇస్తున్న స్లోగన్‌పై క్రికెట్ అభిమానులు ట్రోలింగ్‌కి దిగుతున్నారు.
ఐపీఎల్‌లో ఆర్సీబీ ఒక స్టార్ టీమ్. ఒక్క సారి కూడా కప్ కొట్టకపోయినా.. మరే జట్టుకు లేనంత ఫాలోయింగ్ ఆర్సీబీకి ఉంది. అందుకు కారణం విరాట్ కోహ్లీ ఆ టీమ్‌లో ఉండటం. కోహ్లీతో పాటు ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ లాంటి స్టార్లు సైతం ఆర్సీబీకి ఆడారు. దీంతో.. ఆ జట్టుకు ఫ్యాన్ బేస్ భారీగా ఉంది. కానీ.. ఒక్క సారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. కానీ ప్రతి ఏడాది కప్ కొట్టబోతున్నాం అంటూ ఆర్సీబీ నుంచి హామీలు వినిపిస్థాయి. ‘ఈ సాలా కప్ నమ్‌దే’(ఈ సారి కప్ మనదే) ఇది ఆర్సీబీ స్లోగన్. ఐపీఎల్‌లో అనేకసార్లు నవ్వుల పాలైన స్లోగన్ కూడా ఇదే. ఎప్పటికీ జరగని ఒక పని గురించి చెప్పడానికి చాలా మంది ఈ సాలా కప్ నమ్‌దే అంటూ ఆ స్లోగన్‌ను అపహాస్యం చేస్తుంటారు. ఆర్సీబీ కప్ కొట్టదు అనే బలమైన నమ్మకం క్రికెట్ అభిమానుల్లో ఉంది. కానీ.. ఆర్సీబీ మాత్రం ప్రతి ఏడాది కప్ మనదే అనడం టోర్నీలో నిరాశపర్చడం అనవాయితీగా మారింది.
ఈ సారి కూడా ఆ జట్టు మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ మరోసారి ఈ సాలా కప్ నమ్‌దే అనే మాటను అన్నాడు. ఐపీఎల్ 2023కు గాను ఆర్సీబీ జెర్సీ ఆవిష్కరణలో పాల్గొన్న ఏబీడీ.. మాట్లాడుతూ.. ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ పేర్కొన్నాడు. ఈ మాటతో పక్కన ఉన్న కోహ్లీ గట్టిగా నవ్వాడు. నెటిజన్లు సైతం ఈ మాటను ఎన్ని సార్లు చెప్తారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రతి సారి కప్ మనదే అనడం.. ఓడిపోవడం బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా కప్ మనదే అంటున్నారు అంటే ఈ సీజన్‌లో కూడా ఆర్సీబీ కప్ కొట్టదంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ సైతం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందే మళ్లీ ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ మొదలుపెట్టేశారు అంటూ నెటిజన్లు ఆర్సీబీని ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ee saala cup namade by ABD 😂❤️
That reaction by Virat Kohli in the BG 😆#RCBUnbox #RCBunboxing pic.twitter.com/E7HJPpL4Zx— Adi (suspended soul) (@aaditea_) March 26, 2023