సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్ తో పాటు అన్ని ఫార్మాట్ల నుంచి కూడా తప్పుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాను ఇంగ్లీష్, ఆఫ్రికన్, హిందీ భాషల్లో ధన్యవాదాలు అంటూ ఏబీడీ తెలిపాడు. ఏబీ డివిలియర్స్ గతంలోనే దక్షిణాఫ్రికా క్రికెట్ టీమ్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మొత్తం క్రికెట్ ఆట నుంచే తప్పుకోనున్నట్లు ప్రకటించటంతో అతని ఫ్యాన్స్ షాక్ కు గురవుతున్నారు.
ఇక ఏబీ డివిలియర్స్ కి ఇండియాపై తనకున్న అనుబంధం గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా ఇండియాలో నిర్వహించే ఐపీఎల్ లో డివిలియర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరుపున కీలక ఆటగాడిగా కొనసాగాడు. దీంతో ఇండియా ఆటగాళ్లతో ఐపీఎల్ ఆడడంతో భారత్ కు ఏబీ డివిలియర్స్ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలోనే అతను ఇండియాతో ఉన్న అనుబంధాన్ని హిందీ భాషలో ధన్యవాదాలు అంటూ తెలియజేశాడని ఇండియా క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
It has been an incredible journey, but I have decided to retire from all cricket.
Ever since the back yard matches with my older brothers, I have played the game with pure enjoyment and unbridled enthusiasm. Now, at the age of 37, that flame no longer burns so brightly. pic.twitter.com/W1Z41wFeli
— AB de Villiers (@ABdeVilliers17) November 19, 2021
To the best player of our times and the most inspirational person I’ve met, you can be very proud of what you’ve done and what you’ve given to RCB my brother. Our bond is beyond the game and will always be.
— Virat Kohli (@imVkohli) November 19, 2021