టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9 నుంచి ప్రతిష్ఠాత్మక బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. నాగ్ పూర్ వేదికగా కొన్ని గంటల్లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. దీనికోసం ఇరుజట్లు ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నాయి. స్వదేశంలో జరుగుతుండటం మనకు ప్లస్ కానుండగా, ఆస్ట్రేలియా మాత్రం ఎలాగైనా సరే ఈ సిరీస్ గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది. అందుకు తగ్గట్లే ఎవరికి వాళ్లు ప్లాన్ చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఇది క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. నైన్టీస్ కిడ్స్ కి ఆస్ట్రేలియా ఓపెనర్ అనగానే గిల్ క్రిస్ట్ గుర్తొస్తాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ తో ఓపెనింగ్ లో తన మార్క్ క్రియేట్ చేశాడు. ఇతడి తర్వాత ఆ స్థాయిలో కాకపోయినప్పటికీ.. బాగానే పేరు తెచ్చుకున్న క్రికెటర్ ఆరోన్ ఫించ్. కెప్టెన్ పలు విజయాలు అందుకున్న ఇతడు.. ఓపెనర్ గానూ పలు అద్భుతమైన ఇన్నింగ్సులు ఆడాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఇతడు.. గతేడాది సెప్టెంబరులో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ టీ20ల్లో కొనసాగుతూ వచ్చాడు. తాజాగా ఆ ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. ఆ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది.
కెరీర్ లో అని ఫార్మాట్లలో కలిపి 254 మ్యాచులు ఆడిన ఫించ్.. 8804 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 172 పరుగులు. ఇక 2020లో ఆస్ట్రేలియా పురుషుల వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, 2014, 2018లో ఆసీస్ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచాడు. 2015 వన్డే వరల్డ్ కప్, 2021 టీ20 ప్రపంచకప్ గెలుచుకున్నప్పుడు ఆసీస్ జట్టుకు కెప్టెన్ మనోడే. ఇక 2017-22 వరకు వన్డే జట్టుకు, 2014-16, 2018-22 వరకు టీ20 కెప్టెన్ గా పనిచేశాడు. ఆస్ట్రేలియా టీ20 జట్టుకు ఎక్కువ కాలం కెప్టెన్ గా పనిచేసిన రికార్డు కూడా మనోడి పేరిట ఉండటం విశేషం. ఇక ఐపీఎల్ లోనూ దాదాపు అన్ని జట్లకు ఆడేసిన రికార్డు కూడా ఫించ్ పేరు మీదే ఉంది. మరి ఇలాంటి ఫించ్ రిటైర్మెంట్ తీసుకోవడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
Our World Cup winning, longest serving men’s T20I captain has called time on a remarkable career.
Thanks for everything @AaronFinch5 🤝 pic.twitter.com/cVdeJQmCXN
— Cricket Australia (@CricketAus) February 6, 2023