టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గత కొంత కాలంగా తన స్థాయి తగ్గ ప్రదర్శన కనబర్చలేదనేది వాస్తవం. రన్ మెషీన్‌లా.. మంచి నీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు బాదిన కోహ్లీ సెంచరీ చేసి నేటికి 993 రోజులైంది. కోహ్లీ ఖాతాలో ఇప్పటికే 70 సెంచరీలు ఉన్నా.. 71వ సెంచరీ మాత్రం ఇంకా రాలేదు. దీన్ని బట్టి కోహ్లీ ఎలాంటి బ్యాడ్ ఫామ్‌లో ఉన్నాడో అర్థం అవుతుంది. కానీ.. కోహ్లీ మరీ అంత దారుణమైన ఫామ్‌లో మాత్రం లేడు.
అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పరుగులు చేస్తున్నా.. ఒక భారీ ఇన్నింగ్స్ మాత్రం రావడంలేదు. ఐపీఎల్ 2022లోనే కోహ్లీ దారుణంగా విఫలం అయ్యాడు. అది చూసి కోహ్లీ అత్యంత దారుణమైన ఫామ్‌లో ఉన్నాడంటే లేని ఒత్తిడిని సృష్టించారు. దీంతో కోహ్లీ సైతం ఐపీఎల్ తర్వాత మరింత నెమ్మదించాడు. కానీ.. కోహ్లీ ఒక్కసారి ఫామ్‌లోకి వచ్చే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయినా కూడా కోహ్లీని తక్కువ చేస్తూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఆకిబ్ జావేద్ కామెంట్ చేశారు. పైగా విరాట్ కోహ్లీని పాక్ కెప్టెన్ బాబర్ అజమ్‌తో పోల్చుతూ కొంచెం సెటైరికల్‌గా వ్యాఖ్యలు చేశారు.
‘విరాట్ కోహ్లీ చాలా ఎక్కువ కాలం బ్యాడ్ ఫామ్‌లో ఉన్నాడు. అదే బాబర్ అజమ్, కేన్ విలియమ్సన్, జో రూట్ లాంటి ఆటగాళ్లు ఫామ్ కోల్పోతే ఫామ్‌లోకి వచ్చేందుకు కచ్చితంగా ఇంత టైమ్ అయితే తీసుకోరు. క్రికెట్‌లో రెండు రకాల ఆటగాళ్లు ఉంటారు. ఒకరు ఫామ్ కోల్పోతే తమ లోపాన్ని వెంటనే గుర్తించి ఫామ్ పుంజుకుంటారు. బాబర్ అజమ్, విలియమ్సన్, రూట్ ఈ కోవకు చెందినవారు.
కానీ.. కోహ్లీ మాత్రం ఫామ్ కోల్పోవడంతో తన టెక్నిక్‌ను మార్చుకుని.. మరింత అయోమయానికి గురి అవుతున్నాడు. ఆఫ్‌సైడ్ దూరంగా వెళ్తున్న బంతులను ఆడేందుకు కోహ్లీ ఇబ్బంది పడుతున్నాడు. దీంతో అతను ఆ బంతులను ఆడకుండా ఉండేందుకు ప్రాక్టీస్ చేస్తున్నాడు. దీంతో తన టెక్నిక్‌లో మార్పులు చేసుకుంటున్నాడు. అలా కాకుండా అతను ఫ్రీగా ఆడి.. ఒక భారీ ఇన్నింగ్స్ చేస్తే ఫామ్‌లోకి వచ్చే అవకాశం ఉంది.’ అని జావేద్ పేర్కొన్నారు.
కాగా జావేద్ కామెంట్స్‌పై కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. కోహ్లీని బాబర్ అజమ్‌తో పోల్చడం సరికాదని అంటున్నారు. ఒకసారి ఫామ్ కోల్పోతే అప్పుడు బాబర్ సత్తా తెలుస్తుందని.. అయినా కోహ్లీ సుదీర్ఘకాలం తన ఫామ్‌ను కొనసాగించాడని, బాబర్‌కు అంత సీన్ లేదంటూ కౌంటర్ ఇస్తున్నారు. మరి కోహ్లీ విషయంలో జావేద్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
‘Babar will never have rough patch like Virat Kohli’:Aaqib Javed#CricketTwitter #cricketnews #viratkohli #BabarAzam
— CricInformer(Cricket News & Fantasy Tips) (@CricInformer) August 13, 2022
ఇది కూడా చదవండి: సూర్యకుమార్ యాదవ్‌పై పాకిస్తాన్ ఫ్యాన్స్ అక్కసు! కారణం?