బలహీనుడిని ఎలాగైనా ఓడించవచ్చు.. ఎందుకంటే వాడు ఎలాగో బలహీనుడు కాబట్టి. కానీ బలవంతుడిని ఓడించాలి అంటే.. చెమటోడ్చాలి, రక్తం చిందించాలి. అంత దమ్ము, ధైర్యం ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కు లేవు. అందుకే ప్రత్యర్థిపై మాటల యుద్ధానికి దిగుతుంటారు. ఇక ‘స్లెడ్జింగ్’ ఆసిస్ కు వెన్నతో పెట్టిన విద్య అని ప్రపంచం మెుత్తానికి తెలుసు. ఈ విద్యతోనే ఎన్నో సిరీస్ లను కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ లో పర్యటించనుంది ఆసిస్ టీమ్. టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియా ఆటగాళ్ల మానసిక ధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తోంది ఆసిస్. అందులో భాగంగానే నీచానికి దిగజారింది ఆస్ట్రేలియా. మూడేళ్ల క్రితం నాటి ఓ వీడియోను షేర్ చేసి.. టీమిండియా ఆటగాళ్లను మానసికంగా దెబ్బకొట్టాలని చూస్తోంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. యాషెస్ సిరీస్ కంటే ఎక్కవే అని తాజాగా స్టీవ్ స్మిత్ చెప్పిన సంగతి మనకు తెలిసిందే. మరి అలాంటి సిరీస్ ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా.. ఫిబ్రవరి 9న నాగపూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా టీమిండియాపై తన అక్కసును వెళ్లగక్కింది. ఎప్పటిలాగే ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీయాలని చూసింది. ఈ సందర్భంగా క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీటర్ లో ఓ వీడియోను షేర్ చేసింది. అసలు ఆ వీడియోలో ఏముందంటే?
2020లో ఆస్ట్రేలియాలో పర్యటించింది టీమిండియా. ఆ సిరీస్ లో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలం అవ్వడంతో కేవలం 36 పరుగులకే భారత్ కుప్పకూలింది. ఈ మ్యాచ్ లో ఆసిస్ బౌలర్లు అయిన హేజిల్ వుడ్ (5/8), పాట్ కమ్మిన్స్ (4/24)తో చెలరేగడంతో భారత్ కు ఓటమి తప్పలేదు. ఈ ఇన్నింగ్స్ కు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. అయితే ఈ ఓటమి అనంతరం గొప్పగా పుంజుకుంది టీమిండియా. నాలుగు టెస్టుల సిరీస్ ను 2-1తో చేజిక్కించుకుని రికార్డు నెలకొల్పింది. ఆసిస్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా టీమిండియా ఘనత వహించింది. ఇక ఈ వీడియోకి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా. అతడి దెబ్బకు గిలగిల కొట్టుకుంది క్రికెట్ ఆస్ట్రేలియా.
All out for 36 😳
The Border-Gavaskar Trophy starts on Thursday! #INDvAUS pic.twitter.com/Uv08jytTS7
— cricket.com.au (@cricketcomau) February 6, 2023
ఈ వీడియో ఓకేగానీ.. మరి ఆ సిరీస్ స్కోర్ లైన్ ఏది? జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్న సంధించాడు ఆకాశ్ చోప్రా. చోప్రా ప్రశ్నకు అటునుంచి ఏ సమాధానం రాలేదు. సమాధానం చెప్తే తమ పరువుపోతుందని క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలుసు. ఇక ఇదంతా గమనిస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఫైర్ అవుతున్నారు. మీరు 2004 నుంచి భారత్ లో సిరీస్ గెలవలేదు ముందు అది గుర్తుంచుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సిరీస్ గెలవడం కోసం మరీ ఇంత నీచానికి దిగజారాలా? అంటూ ఆస్ట్రేలియా క్రికెట్ కు ప్రశ్నల బాణాలు సంధిస్తున్నారు. ఇలాంటి పనికి మాలిన పనులు మరోసారి చెయ్యోద్దని వార్నింగ్ లు సైతం ఇస్తున్నారు. మీరెన్ని కోతి చేష్టలు చేసినా.. ఈ సారి సిరీస్ టీమిండియా సొంతం అంటూ మరికొంత మంది అభిమాను కామెంట్స్ చేస్తున్నారు. మరి క్రికెట్ ఆస్ట్రేలియాకు ఆకాశ్ చోప్రా ఇచ్చిన స్ట్రాంగ్ రిప్లైపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
And the series score-line? #JustAsking 🫶 https://t.co/u0X43GgS8k
— Aakash Chopra (@cricketaakash) February 6, 2023