‘ఎంఎస్ ధోనీ’, కెప్టెన్ కూల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే పేర్లున్నాయి. పేర్లే కాదు.. ధోనీ పేరు మీద ట్రోఫీలు కూడా చాలానే ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికిన సమయంలో తాలా అభిమానులు ఎంతగానో బాధపడ్డారు. మళ్లీ ఐపీఎల్ రూపంలో మైదానంలో ధోనీ చూసుకుంటూ వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఎంఎస్ ధోనీకి ఐపీఎల్ 2021 సీజన్ లాస్ట్ అనే టాక్ రావడంతో అందరూ షాకయ్యారు. వయసు రీత్యా ఇంక ధోనీ ఐపీఎల్ కూడా ఆడలేడని క్రికెట్ పండితులు అభిప్రాయ పడుతున్నారు. అందుకూ ఊతమిచ్చేలా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్‌కి ధోనీ మెంటర్‌గా ఉండేందుకు అంగీకరించాడు. అప్పటి నుంచి అందరి మదిలో ఇదే ప్రశ్న.. ఇకనుంచి ధోనీని మెంటర్‌గా లేదా సీఎస్కే వ్యూహకర్తగా చూడాల్సిందేనేమో అనే అభిప్రాయానికి వచ్చేశారు. అలా ఫిక్స్ అయిపోయిన సీఎస్కే అభిమానులకు ధోనీ గుడ్ న్యూస్ చెప్పేశాడు.
ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ధోనీ చెప్పిన సమాధానం ఇప్పుడు మొత్తం సీఎస్కే అభిమానులను ఎగిరి గంతేసేలా చేస్తోంది. ఈ సీజన్ తర్వాత ధోనీ ఐపీఎల్ నుంచి తప్పుకుంటాడన్న వార్తల దృష్ట్యా ధోనీ స్పందించాడు. ఓ కార్యక్రమంలో భాగంగా అభిమానితో వర్చువల్‌గా మాట్లాడిన ధోనీ తన రిటైర్మెంట్‌పై స్పష్టత నిచ్చాడు. ఐపీఎల్‌లో తన ఆఖరి మ్యాచ్ కచ్చితంగా చెన్నైలోనే ఉంటదన్నాడు. ఆగస్టు 15 కన్నా మించిన తేదీ దొరకదేమో అని అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధాన మిచ్చిన ధోనీ ‘నాకు వీడ్కోలు పలికేందుకు మీకు ఇంకా అవకాశం ఉంది. నేను చెన్నైలో నా ఆఖరి మ్యాచ్ ఆడి.. నా అభిమానులను అందరినీ కలుసుకుంటాను. మీరు కూడా అక్కడికి వస్తారని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. అంటే వచ్చే సీజన్ కూడా ధోనీ ఐపీఎల్ ఆడనున్నట్లు చెప్పకనే చెప్పాడు. ఈ సీజన్‌లో పిచ్చ ఫామ్‌లో ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్‌ను చూసి అభిమానులు ఆనంద పడిపోతుంటే.. ఈ వార్తతో వారి ఆనందం రెట్టింపైంది. ధోనీ చేసిన ప్రకటనపై మీరేమంటారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: బయటపడ్డ మహేశ్ బాబు ఆస్తుల లెక్కలు.. షాకైన టాలీవుడ్ వర్గాలు..