ఆసక్తి ఉండాలే గాని అంగవైకల్యం మనం సాధించాలనే కళకు అడ్డం రాదు. క్రికెట్ మీద అభిమానంతో ఒక కుర్రాడు చేసిన పనికి అందరూ షాకవ్వాల్సిందే.
దేశంలో క్రికెట్ కి ఎంతలా పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రికెట్ ని ఒక మతంలా భావించే మన దేశంలో ఈ ఆటకి ఎప్పటికప్పుడూ క్రేజ్ పెరుగుతూనే ఉంటుంది. టీమిండియా క్రికెట్ ఆడుతుంటే చాలు ఒక పండగల భావిస్తారు. ఇక ఐపీఎల్ వరల్డ్ కప్ వచ్చిందంటే ఆ హంగామా నెక్స్ట్ లెవల్లో ఉండడం గ్యారంటీ. కులం, మతంతో సంబంధం లేకుండా చిన్న,పెద్ద తేడా లేకుండా అందరికి కామన్ గా నచ్చిన ఆట క్రికెట్. ఇంతలా క్రికెట్ ని అభిమానించే మన దేశంలో అంగవైకల్యం ఉన్నవారికి కూడా క్రికెట్ టోర్నీలు నిర్వహిస్తారని చాలా కొద్ది మందికే తెలుసు. అయితే ఇప్పుడు ఒక గల్లీ క్రికెట్ లో ఒక వీడియో గుండెల్ని హత్తుకునేలా ఉంది.
కాళ్ళు, చేతులు ఈ రెండిటిలో ఏది లేకపోయినా క్రికెట్ ఆడడానికి పనికి రారు. అయితే ఒక యువకుడు మాత్రం అవేమి పట్టించుకోలేదు. క్రికెట్ ఆడాలన్న పట్టుదల, ఇష్టంతో తన వైకల్యాన్ని మరిపించేలా చేసాడు. రెండు చేతులు లేకపోయినా అదిరిపోయే యార్కర్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ విషయాన్ని నమ్మడానికి కాస్త టైం పట్టినా ఇది అక్షరాలా నిజం. అదెలా అంటారా? బంతిని నెల మీద ఉంచి ఎడమ కాలుతో అదిమిపట్టి బలంగా వికెట్ల వైపుకి విసిరాడు. అయితే బంతి సరాసరి బ్యాటర్ వైపుగా వెళ్ళింది. అంతే కాదు ఆ బాల్ యార్కర్ గా వెళ్లడం ఇక్కడ మరో విశేషం. అచ్చం ఒక బౌలర్ ఎలా బౌలింగ్ వేస్తాడో అలాగే వేయడం గమనార్హం.
ఆ యువకుడు చూపించిన ప్రతిభకి భారత మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్ ఫిదా అయిపోయాడు. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇతడే అసలైన క్రికెట్ ప్రేమికుడు అంటూ క్యాప్షన్ జోడించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోకి సంబంధించి నెటిజన్స్ ఈ కుర్రాడి ప్రతిభ చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నువ్వు నిజంగా తోపు బ్రో.. హ్యాట్సాప్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆసక్తి ఉండాలే గాని అంగవైకల్యం మనిషికి అడ్డం కాదు అని నిరూపించిన ఈ కుర్రాడి పట్టుదల మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Ye hain asli cricket lover, kya baat hain aapne to ❤️ jeet liya pic.twitter.com/Js1gfYXiAL
— Munaf Patel (@munafpa99881129) July 11, 2023