ధోని గ్రౌండ్ లోకి పెడితే చాలు అభిమానుల గోలతో స్టేడియం హోరెత్తిపోతుంది. ఇక పుట్టినరోజైతే ఆ హంగామా నెక్స్ట్ లెవల్లో ఉండడం గ్యారంటీ. ఈ క్రమంలో తెలుగు ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకుంటూ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
భారత క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కూల్ కెప్టెన్ గా , ఫినిషర్ గా క్రికెట్ లో ఒక కొత్త ట్రెండ్ సృష్టించాడు. ఒక్క ఐసీసీ ట్రోఫీ కోసం పడిగాపులు కాస్తుంటే 6 ఏళ్ళ వ్యవధిలో ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. వీటిలో వన్డే వరల్డ్ కప్, టీ 20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మూడు రకాలైన ఐసీసీ ట్రోఫీలున్నాయి. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు చివరి వరకు క్రీజ్ లో ఉంది కూల్ గా మ్యాచ్ ఫినిష్ చేయడం మాహీ కే చెందుతుంది. ఇక తన కెప్టెన్సీతో అసాధ్యం అనుకున్న ఎన్నో మ్యాచులను సుసాధ్యం చేసి చూపించాడు. రెప్పపాటులో, ఊహకు అందని రీతిలో స్టంపింగ్ చేస్తూ ఎంతో మంది ప్రత్యర్థి బ్యాటర్లను షాక్ కి గురి చేసాడు. ఇన్ని ఘనతలు సాధించిన మహేంద్రుడు రేపు 43 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు.
ధోని గ్రౌండ్ లోకి పెడితే చాలు అభిమానుల గోలతో స్టేడియం హోరెత్తిపోతుంది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ చూస్తే మాహీ క్రేజ్ ఏంటో తెలిసిపోతుంది. తన ప్రదర్శనకే కాదు ఆటిట్యూడ్ కి కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. రేపు ధోని పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ క్రమంలో తెలుగు ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగు ఫ్యాన్స్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నగరంలోని ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ వద్ద 52 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ధోనీ బర్త్‌డే సందర్భంగా శుక్రవారం ఈ భారీ కటౌట్‌ను ఆవిష్కరించనున్నారు. అంతేకాదు భారీ కేక్ కూడా కట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ధోనీ గ్రౌండ్‌లోకి నడిచి వస్తున్న వస్తున్న ఫోజ్‌తో ఈ కటౌట్ ఏర్పాటు చేశారు.
ధోనీ బర్త్‌డే సందర్భంగా అతని బయోపిక్ ఎంఎస్ ధోనీ అన్ టోల్డ్ స్టోరీ మూవీని రీరిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఆంధ్రాలోని నందిగామ ఫ్యాన్స్.. 77 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇదే అతిపెద్ద కటౌట్‌గా చరిత్రలో నిలవనుంది. ధోనీ కటౌట్ పెట్టడం ఇదే తొలిసారి కాదు.. ఇదివరకే 2018లో కేరళలో 35 అడుగులు, చెన్నైలో 30 అడుగుల కటౌట్, విజయవాడలో 41 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఈ సారి వాటికి మించి హైదరాబాద్ లో 52 అడుగులు, ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తూ నందిగామలో 77 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇంతలా అభిమానం చాటుకున్న తెలుగు ఫ్యాన్స్ మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
52 feet cut-out of MS Dhoni in Hyderabad for his birthday celebration.
The craze for MS Dhoni. pic.twitter.com/i8pVCXHc2H
— Johns. (@CricCrazyJohns) July 6, 2023