న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. టీ20 సిరీస్‌లో మాత్రం తొలి మ్యాచ్‌లోనే బోల్తా కొట్టింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు లేకుండా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగిన యువ భారత జట్టు దారుణంగా విఫలం అయ్యింది. టాస్ గెలిస్తే చాలు మ్యాచ్ గెలిచే రాంచీ మైదానంలో.. టీమిండియా టాస్ గెలిచి కూడా మ్యాచ్ ఓడిపోయింది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై పేసర్లు తేలిపోగా.. బ్యాటింగ్‌లో టాపార్డర్ అత్యంత ఘోరంగా ఫెయిల్ అయింది. ఇవ్వాల్సిన పరుగుల కంటే 20 పరుగులు ఎక్కువగా సమర్పించుకున్న టీమిండియా.. చివరికి అదే తేడాతో మ్యాచ్ చేజార్చుకుంది. దీంతో.. మూడు టీ20ల సిరీస్‌లో 0-1తో న్యూజిలాండ్ ఆధిక్యంలోకి వెళ్లింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది న్యూజిలాండ్. కాన్వె 52, డార్లీ మిచెల్ 59 పరుగులతో రాణించారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన అర్షదీప్ బౌలింగ్‌లో మిచెల్ విధ్వంసం సృష్టించాడు. వరుసగా మూడు సిక్సులు, ఒక ఫోర్‌తో పాటు మొత్తం 27 పరుగులు పిండుకున్నాడు. ఓటమికి కారణంగా నిలిచిందని చెప్పవచ్చు. అయితే ఈ గ్రౌండ్‌లో 177 రన్స్ టార్గెట్ పెద్ద కష్టమేమి కాదు, పైగా డ్యూ ఉండటంతో బ్యాటింగ్ ఈజీ అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ పేసర్లకు స్వింగ్ మూమెంట్ లభించడంతో వారు చెలరేగిపోయాడు. అలాగే స్పిన్నర్లకు మొదటి నుంచి పిచ్ అనుకూలంగా ఉంది. దీంతో కివీస్ స్పిన్నర్లు సైతం భారత బ్యాటర్లతో ఓ ఆట ఆడుకున్నారు. వారి ధాటికి టీమిండియా 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ 47, వాషింగ్టన్ సుందర్ 50 మినహా మిగతా బ్యాటర్లు విఫలం అవ్వడంతో భారత్.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి 21 రన్స్ తేడాతో ఓటమి పాలైంది.
భారత ఓటమికి 5 ప్రధాన కారణాలు..
That’s that from Ranchi.
New Zealand win the first T20I by 21 runs in Ranchi.#TeamIndia will look to bounce back in the second #INDvNZ T20I.@mastercardindia pic.twitter.com/Lg8zmzwYVH
— BCCI (@BCCI) January 27, 2023