ఐపీఎల్ చూసి ఆహా ఓహో అనుకోవడం కాదు. టీ20ల్లో ఏ జట్టుకి సాధ్యం కాని విధంగా ఓ టీమ్, ఒక్క ఇన్నింగ్స్ లో 324 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంతకీ అదెక్కడో తెలుసా?
క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఐపీఎల్ గోలలో పడిపోయారు. క్వాలిఫయర్ మ్యాచ్ లో గుజరాత్ పై అద్భుత విజయం సాధించిన చెన్నై.. 10వ సారి ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. సరిగా ఈ గ్యాప్ లో టీ20ల్లోనే సరికొత్త రికార్డు నమోదైంది. రికార్డ్ అంటే ఆ ఏముందిలే అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది ఆషామాషీది అయితే కాదు. ఎందుకంటే టీ20ల్లోని ఓ ఇన్నింగ్స్ లో 200 పరుగులు కొట్టడమే ఎక్కువ అనుకుంటే.. ఏకంగా 324 రన్స్ కొట్టి ప్రతి ఒక్కరి మైండ్ పోయేలా చేశారు. ఇది ఓ గుర్తింపు తెచ్చుకున్న లీగ్ లో జరగడం మరో విశేషం. ఇంతకీ ఇది ఎక్కడ ఎప్పుడు జరిగింది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ పేరు చెప్పగానే ఆహా ఓహో అనే రికార్డులు గుర్తొస్తాయి. లీగ్ లో ఎక్కువ, తక్కువ పరుగులు చేసిన జట్టుగా ఆర్సీబీ ఎప్పుడో రికార్డు సృష్టించింది. ఐపీఎల్ లో కాకుండా ఓవరాల్ టీ20ల్లో ఇప్పటివరకు ఒక ఇన్నింగ్స్ లో ఎక్కువ రన్స్ అఫ్ఝానిస్థాన్ జట్టు చేసింది. 2019లో డెహ్రాడూన్ లో జరిగిన టీ20లో ఐర్లాండ్ పై 278/3 పరుగుల భారీ స్కోరు చేసింది. దాదాపు మూడేళ్ల నంచి చెక్కు చెదరకుండా ఉన్న ఈ రికార్డుని ఇప్పుడు ససెక్స్ 2nd XI జట్టు బ్రేక్ చేసింది. ఒక్క ఇన్నింగ్స్ లో ఏకంగా 324/7 భారీ స్కోరు చేసింది. అసలెలా అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా చేసింది.
‘సెకండ్ ఎలెవన్ ట్వంటీ20’ పేరుతో ఇంగ్లాండ్ లో ప్రతి ఏడాది ఓ లీగ్ ని నిర్వహిస్తున్నారు. తాజాగా ససెక్స్ 2nd XI vs మిడిల్ సెక్స్ 2nd XI జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ససెక్స్ టీమ్.. నిర్ణీత 20 ఓవర్లలో 324/7 స్కోరు చేసింది. కెప్టెన్ రవి బొపారా 49 బంతుల్లో 144 రన్స్ బాదేశాడు. ఇందులో 14 ఫోర్లు, 12 సిక్సులు ఉండటం విశేషం. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రత్యర్థి జట్టు ఓవర్లన్నీ ఆడి 130 పరుగులకే ఆలౌటైంది. దీంతో ససెక్స్ 194 తేడాతో విజయం సాధించింది. అయితే ఇలా ఒక్క ఇన్నింగ్స్ లో 300కి పైగా స్కోరు కొట్టడం ఓ ఎత్తయితే, దాదాపు 200 రన్స్ తేడాతో గెలవడం మరో విశేషం. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. రవి బొపారా ఇంగ్లాండ్ లో ఉన్నప్పటికీ మూలాలు మాత్రం మన దేశంలో ఉన్నాయి. మరి క్రికెట్ లవర్స్ ని అవాక్కయ్యేలా చేసిన స్కోరుపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
Ravi Bopara just SMASHED 144 from 49 balls for Sussex’s 2nd XI 🚀🤯
His innings included 12 sixes and 14 fours with Sussex finishing on 324/7 in their 20 overs 😅
📸 @SussexCCC #CricketDistrict #SussexCricket #RaviBopara pic.twitter.com/5Uf1SzTFeG
— Cricket District (@cricketdistrict) May 23, 2023