టీమిండియా స్టార్ యువ క్రికెటర్ రిషభ్ పంత్ నేడు(శుక్రవారం, డిసెంబర్ 30) రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తన కుటుంబంతో కలిసి న్యూఇయర్ సెలట్రేట్ చేసుకునేందుకు ఢిల్లీ నుంచి తన స్వగ్రామానికి కారులో ఒంటరిగా బయలుదేరిన పంత్.. దురదృష్టవశాత్తు మార్గ మధ్యలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఉదయం 5.30 నిమిషాల ప్రాంతంలో ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేలో హమ్మద్‌పూర్ ఝల్ సమీపంలోని రూర్కీలోని నర్సన్ సరిహద్దులో కారు ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు, లోకల్ పోలీసులు పంత్‌ను సమీపంలోని సక్షమ్ ఆస్పత్రికి తరలించారు. నిద్రమత్తులో కారును అదుపుచేయలేక ప్రమాదానికి గురైనట్లు పంత్ పోలీసులకు వెల్లడించాడు. అయితే.. ప్రమాద సమయంలో స్థానికుల వారి వారి ఫోన్లలో తీసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అర్ధరాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరిన పంత్.. తన ఇంటికి మరికొన్ని నిమిషాల్లో చేరుకుంటాడు అనుకునే టైమ్‌లో.. అతని కారు అదుపుతప్పి డివైడర్ రైలింగ్‌ను ఢీ కొట్టింది. ఆ సమయంలో పంత్ నిద్రమత్తులో ఉండటంతో చాలా వేగంతో వెళ్తున్న కారును అదుపుచేయలేకపోయాడు. అయితే.. పంత్ కారు ప్రమాదానికి గురైన టైమ్‌లో హైవే పక్కన నివాసముండే స్థానికులు అక్కడి చేరుకున్నారు. అదే సమయంలో ఆ రోడ్డు గుండా వెళ్తున్న ఒక బస్సు డ్రైవర్ సైతం ఏదో ప్రమాదం జరిగిందని బస్సును పక్కకు ఆపి.. ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్నాడు. అయితే.. కారులో మంటలు పూర్తిగా వ్యాపించడానికి ముందే.. పంత్ అందులో నుంచి బయటపడ్డాడు. అయితే.. పంత్‌కు ఆ బస్సు డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు యువకులు సహాయం చేసినట్లు సమాచారం.
పంత్‌ను కారు నుంచి దూరంగా తీసుకొచ్చి.. అంబులెన్స్‌కు ఫోన్ చేసి అతన్ని పోలీసుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పంత్‌ను రక్షించిన బస్సు డ్రైవర్ మీడియాతో మాట్లాడుతూ..‘కారు డివైడర్‌కి ఢీకొట్టడం, పంత్‌కు గాయాలు కావడం చూశాను, అతను కారు నుంచి బయటకు వచ్చాడు, నేను నా బస్సును ఆపి అతని దగ్గరికి వెళ్లి, అతన్ని సురక్షితమైన స్థలంలో పడుకోబెట్టి, నా షీట్‌తో చుట్టి, ఆపై అంబులెన్స్‌కి కాల్ చేశాను’ అని వెల్లడించాడు. ఆ డ్రైవర్, మరో ఇద్దరు యువకులు స్పందించకపోయి ఉంటే.. పంత్ మరింత తీవ్రమైన ప్రమాదానికి గురయ్యేవాడు. ప్రస్తుతం పంత్‌ను రక్షించిన ఆ ముగ్గురు యువకులపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rishabh Pant’s miraculous escape after his car met with an accident early morning on Friday. pic.twitter.com/APtcjxbdEp
— TIMES NOW (@TimesNow) December 30, 2022
Shukr alhamdulillah 🤲 Itni Buri Accident ke baad bhi Tum thik ho
Rishabh Pant 🙏Now i Just Hope Rishabh Pant jaldi se Recover ho jaye ap sabhi Se bhi Dua ki darkhwast!!#RishabhPantAccident #RishabhPant pic.twitter.com/Uo87R7DCF3
— mr Khan (@mr_sany_) December 30, 2022