భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ధోని పేరును చెప్పుకుంటారు. కానీ, అలాంటి కెప్టెన్ పేరిట కూడా కొన్ని చెత్త రికార్డులు ఉన్నాయి. అలాంటి ఓ చెత్త రికార్డును ఇప్పుడు రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా దారుణ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ టార్గెట్‌ను ఆస్ట్రేలియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది.. 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే.. ఈ ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కెప్టెన్ ఈ చెత్త రికార్డు గతంలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పేరిట ఉండేది. కానీ, ఆస్ట్రేలియాపై రెండో వన్డేలో ఓటమితో ఆ చెత్త రికార్డును రోహిత్ శర్మ దాటేసి.. కొత్త చెత్త రికార్డును నమోదు చేశాడు.
టీమిండియాకు ధోని మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతని కెప్టెన్సీలోనే భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలో దక్కాయి. వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో ధోని సారథ్యంలో భారత్ గెలిచింది. అలాగే ధోని వారసుడిగా భారత కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ అదే టెంపోను కొనసాగించాడు. ధోనిలా ఐసీసీ ట్రోఫీలు గెలవలేకపోయినా.. జట్టును పటిష్టంగానే ఉంచాడు. టెస్టుల్లో టీమిండియాను నంబర్ స్థానంలో నిలబెట్టాడు. కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించారు. రోహిత్ సైతం టీమ్‌ను విజయం పథంలో నడిపిస్తున్నప్పటికీ.. ఒక చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
టీమిండియా ధోని కెప్టెన్సీలో 200 వన్డే మ్యాచ్‌లు ఆడింది. అందులో రెండు సార్లు టీమిండియా 150 లోపలే ఆలౌట్ అయింది. కాగా.. రోహిత్ శర్మ ఇప్పటి వరకు 25 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అందులో ఏకంగా 3 సార్లు భారత్ 150 కంటే తక్కువ స్కోర్ ఆలౌట్ అయింది. ఇలా ధోని కెప్టెన్సీలో చెత్త రికార్డును రోహిత్ శర్మ కేవలం 25 మ్యాచ్‌ల్లోనే బ్రేక్ చేసి.. సరికొత్త చెత్త రికార్డును నమోదు చేశాడు. అయితే.. ఈ చెత్త రికార్డు విషయంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆమడదూరంలో ఉన్నాడు. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా 95 మ్యాచ్‌లు ఆడితే.. ఒక్క సారి కూడా 150 లోపల ఆలౌట్ కాలేదు. దీంతో.. ఈ చెత్త రికార్డుకు కోహ్లీ చాలా దూరంలో ఉన్నాడు. ధోని రెండు మ్యాచ్‌లతో ఆ చెత్త రికార్డును కలిగి ఉంటే.. ఇప్పుడు రోహిత్ 3 మ్యాచ్‌లతో నంబర్ వన్‌గా ఉన్నాడు. మరి.. రోహిత్ కెప్టెన్సీ విషయంలో, రెండో వన్డేలో టీమిండియా ఓటమిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Indian team being bowled out below 150 under different captains
• Virat Kohli – 0 times (95 matches)
• MS Dhoni – 2 (200 matches)
• Rohit Sharma – 3 times (25 matches) 🔥🔥 pic.twitter.com/JGgNQsrMET— Vishal. (@SportyVishaI) March 19, 2023