విదేశీ పిచ్‌లు.. అందునా ఒకసారి ఓటమి.. పైగా గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు దూరం. డబ్ల్యూటీసీ ఫైనల్ ముందు భారత జట్టును వేధిస్తున్న ప్రశ్నలివి. ఇంగ్లండ్ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ పోరుపై అప్పుడే చర్చ మొదలైపోయింది. తుది జట్టు ఎంపికపై.. కీలక ఆటగాళ్లు లేకపోవడం జట్టుపై ఎంత మేర ప్రభావం చూపుతుందో అన్న విషయమై విశ్లేషకులు ఎవరికివారు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. వారి అభిప్రాయాలు ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే పలువురు స్టార్ ఆటగాళ్లు గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. వీరిలో విదేశీ ప్లేయర్లతో పాటు కొంతమంది స్వదేశీ స్టార్ ప్లేయర్లు కూడా ఉండడంతో ఈసారి ఐపీఎల్ కి కాస్త కళ తగ్గనుంది. బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ లాంటి అంతర్జాతీయ స్టార్ల సేవలను ఆ జట్లు కోల్పోనున్నాయి. వీరిలో ఇద్దరు(పంత్, అయ్యర్) ఆయా జట్లకు కెప్టెన్లు కాగా.. మరొకరు(బుమ్రా) ముంబై జట్టులో కీలక బౌలర్. వీరి గాయాలు పెద్దవి కావడమే దీనికి కారణం. ఇదిలా ఉండగా.. ఈ ముగ్గురు ప్లేయర్లు కేవలం ఐపీఎల్ కే కాదు.. డబ్ల్యూటీసీ ఫైనల్ కి కూడా దూరం కానున్నారు.
ఇప్పటికే గాయాల కారణంగా పంత్, బుమ్రా డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి వైదొలగగా.. తాజాగా టీంఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఈ లిస్టులో చేరిపోయాడు. దీంతో ఇప్పుడు టీంఇండియా ఈ ముగ్గురు లేకుండానే డబ్ల్యూటీసీ ఫైనల్లో బరిలోకి దిగనుంది. ప్రస్తుతం భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతుందంటే అందులో పంత్ పాత్ర చాలానే ఉంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ముందువరకు భారత్ తరపున అత్యధిక పరుగులు, అత్యధిక యావరేజ్ కలిగి ఉన్న ఆటగాడు పంత్. లోయర్ ఆర్డర్ లో వస్తూ కూడా ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడుతూ.. భారత్ కి చిరస్మరణీయ విజయాలనందించాడు. బౌలర్ ఎవరైనా, ఆడేది ఏ స్థానంలో అయినా, అటాకింగ్ చేయడమే పంత్ కి తెలుసు. ముఖ్యంగా పంత్.. స్పిన్నర్లను ఎదుర్కునే తీరు చూడ ముచ్చటగా ఉంటుంది. అయితే గతేడాది రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలవ్వడం అతనిని జట్టుకి దూరం చేసింది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న పంత్ డబ్ల్యూటీసీ ఫైనల్ కి దూరమవ్వడం భారత జట్టుకు పెద్ద లోటే అని చెప్పాలి.
ఇక బుమ్రా విషయానికొస్తే.. టీమిండియాకి ప్రధాన బౌలర్ బుమ్రా అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ పేసర్.. భారత బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపిస్తున్నాడు. టీమిండియా విదేశాల్లో విజయాలు సాధిస్తుందంటే బౌలర్ గా బుమ్రా పాత్ర ప్రేత్యేకం. వెన్ను గాయం కారణంగా చాలా కాలం జట్టుకి దూరమైనా.. ఇటీవలే గాయం తీవ్రత ఎక్కువ కావడంతో .. సర్జరీ కోసం న్యూజిలాండ్ వెళాల్సి వచ్చింది. దీంతో మరింత విశ్రాంతి కావాలని డాక్టర్లు సూచించడంతో.. రానున్న 4 నెలలు టీమిండియా ఈ ఫాస్ట్ బౌలర్ సేవలను కోల్పోనుంది. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకమైన డబ్ల్యూటీసీ ఫైనల్ కి కూడా అందుబాటులో లేకపోవడం భారత్ ని మరింత కష్టాల్లోకి నెట్టింది.
గత కొంత కాలంగా ఫార్మాట్ ఏదైనా జట్టులో అత్యంత నిలకడ చూపిస్తున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే.. అది అయ్యరే. ఒక పక్క సీనియర్లు ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నా.. అయ్యర్ మాత్రం ఎంతో పరిణితి చెందిన బ్యాటర్ గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా టెస్టుల్లో దాదాపు ప్రతి మ్యాచ్ లో అయ్యర్ తన మార్క్ చూపించాడు. కానీ ఇప్పుడు ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డబ్ల్యూటీసీ ఫైనల్ కి దూరమవడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపనుంది. వెన్ను గాయం నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చినా.. మళ్లీ గాయం తిరగబెట్టడంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన నాలుగు టెస్టులో బ్యాటింగ్ కి రాలేదు. ఇటీవల సర్జరీ చేయించుకున్న అయ్యర్ కోలుకోవడానికి 4-5 నెలలు పడుతుందని తాజాగా ఓ జాతీయ ఛానల్ కథనాన్ని ప్రచురించింది. దీంతో అయ్యర్ కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ కి అందుబాటులో ఉండడం లేదన్నది వాస్తవం. మరి భారత్ జట్టు కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఈ ముగ్గురు ప్లేయర్లు లేకుండానే బరిలోకి దిగడం భారత విజయావకాశాలపై ఎంత మేర ప్రభావం చూపనుందో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలుపండి.
❌ No Rishabh Pant
❌ No Jasprit Bumrah
❌ No Shreyas IyerIndia will miss three key players in the World Test Championship 2023 final against Australia at the Oval. 😐
Courtesy – #CricTracker#astropay #bet365 #betway #1xbet #parimatch pic.twitter.com/L117Cer12g
— AstroPay Exch India 🇮🇳 (@AstroPay_India) March 22, 2023