ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాడు మొయిన్ అలీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఏడాది క్రితమే టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలకున్నానని.. అందుకే తప్పుకుంటున్నట్లు అప్పట్లో తెలిపాడు. అయితే.. ఆ విషయాన్ని అలీ మరోసారి అభిమానులకు గుర్తు చేస్తూ.. రెండోసారి రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. 35 ఏండ్ల మోయిన్ అలీ ప్రస్తుతం ఇంగ్లాండ్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇటీవల పాకిస్తాన్ తో ముగిసిన టీ20 సిరీస్ లో సారధిగా కూడా వ్యవరించాడు.
అలీ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టు 7 మ్యాచుల టీ20 సిరీస్ ను 4-3 తేడాతో కైవసం చేసుకుంది. ఈ విజయంపై మీడియాతో ముచ్చటించిన అలీ.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇప్పటికే.. ఒకసారి టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన అలీ ఇప్పుడు మరోసారి ఈ ప్రకటన చేశాడు. అందుకు కారణం.. అలీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నాడన్న వార్తలు రావడమే. ఇంగ్లాండ్ తరుపున 64 టెస్టులు ఆడిన అలీ.. 28.29 సగటుతో 2914 పరుగులు చేయడంతో పాటు 36.66 సగటుతో 195 వికెట్లు పడగొట్టాడు. కాగా, అలీ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
🚨 BREAKING 🚨
After announcing his return to Test cricket in the summer, Moeen Ali has yet again announced his retirement from the longest format 🏏#MoeenAli #England #CricketTwitter pic.twitter.com/LI3CiVvIzt
— Sportskeeda (@Sportskeeda) October 4, 2022