ఏ బౌలర్ అయినా సరే ఒకటి రెండు ఓవర్లు మెడిన్ వేస్తేనే గొప్ప అనుకుంటాం. అలాంటిది ఏకంగా 21 ఓవర్లు మెడిన్ వేస్తే.. అది కూడా వరుసగా 21 ఓవర్లు వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుంటే అది ఎంత గొప్ప రికార్డో కదా!. అలాంటి రికార్డును సృష్టించింది ఒక ఇండియన్ బౌలర్. అతని పేరు బాపూ నాదకర్ణి. 1955లో భారత్ తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ ఆల్‌రౌండర్ ఇంగ్లండ్‌తో జరిగిన ఒక టెస్టులో వరుసగా 21 ఓవర్లను మెడిన్‌గా వేసి ప్రపంచ రికార్డును నెలకొల్పారు.
ఆ రికార్డు ఇప్పటి వరకు అలాగే చెక్కుచెదరకుండా ఉంది. 1968లో న్యూజిలాండ్‌తో టెస్టు తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బాపూ.. 41 టెస్టులు ఆడి 88 వికెట్లు పడగొట్టారు. 1414 పరుగులు కూడా చేశారు. కాగా ముంబైకి చెందిన బాపూ 2020 జనవరి 17న తన మరణించారు. మరి బాపూ నెలకొల్పిన రికార్డుపై, ఆయన రికార్డును ఏ బౌలర్ బ్రేక్ చేస్తారని మీరు భావిస్తున్నారో? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.