భారత్ వేదికగా అక్టోబర్ లో 2023 వరల్డ్ కప్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నమెంట్ కి సంబంధించిన షెడ్యూల్ కొన్ని గంటల క్రితమే ఐసీసీ ప్రకటించింది. ఇక హైదరాబాద్ లో మ్యాచులు నిర్వహించి తెలుగు అభిమానులని ఖుషి చేసింది.
ఇండియాలో క్రికెట్ ఎంత ఫేమస్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తెలుగు అభిమానులు కూడా క్రికెట్ ని విపరీతంగా ఆరాధిస్తారు. హైదరాబాద్ లో మ్యాచులు అంటే స్టేడియం హోరెత్తిపోతుంది. ఒక్క ఐపీఎల్ మాత్రమే కాదు అంతర్జాతీయ మ్యాచ్ కోసం మన తెలుగు అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తారు. ఇదిలా ఉండగా ఇప్పుడు తెలుగు అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేయడానికి వరల్డ్ కప్ మ్యాచులు వచ్చేస్తున్నాయి. మొన్నటివరకు హైదరాబాద్ లో మ్యాచ్ నిర్వహణపై కాస్త సందిగ్ధం ఉన్నా.. తాజాగా ఐసీసీ వరల్డ్ కప్ షెడ్యూల్ ని ప్రకటించేసింది. మరి హైదరాబాద్ లో ఏం మ్యాచులు జరగబోతున్నాయి? ఎన్ని మ్యాచులు ఆడబోతున్నారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
భారత్ వేదికగా అక్టోబర్ లో 2023 వరల్డ్ కప్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నమెంట్ కి సంబంధించిన షెడ్యూల్ కొన్ని గంటల క్రితమే ఐసీసీ ప్రకటించింది. ఇక హైదరాబాద్ లో మ్యాచులు నిర్వహించి తెలుగు అభిమానులని ఖుషి చేసింది. ఈ మేరకు మొత్తం హైదరాబాద్ లో మూడు మ్యాచులను నిర్వహించారు. అక్టోబర్ 6,9,12 తారీకులలో ఈ మ్యాచులు జరుగుతాయి. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఈ మ్యాచులు జరగనున్నాయి. అయితే ఈ మూడు మ్యాచుల్లో ఒక్కటి కూడా టీమిండియా మ్యాచ్ లేకపోవడం ఇప్పుడు అభిమానులని నిరాశకు గురి చేస్తుంది. అంతేకాదు ఈ మూడింట్లో రెండు పాకిస్థాన్,ఒకటి న్యూజీలాండ్ జట్లు క్వాలిఫయర్ టీమ్స్ తో తలపడనున్నాయి. పాకిస్థాన్ ఆడబియే మ్యాచుల్లో శ్రీలంక, జింబాబ్వే ప్రత్యర్థులుగా తలపడే అవకాశముంది.
ఇక న్యూజీలాండ్-ఇంగ్లాండ్ జట్లు ప్రపంచ కప్ తొలి మ్యాచ్ ఆడనున్నాయి.ఇక అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్- పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 15 న జరగనుంది. ఇక నవంబర్ 19 న గ్రాండ్ ఫైనల్ తో ఈ వరల్డ్ కప్ ముగుస్తుంది. ఏ మూడు మ్యాచులకి అహ్మదాబాద్ ఆతిధ్యమిస్తుంది. సొంతగడ్డపై ఆడుతుండడంతో ఈ వరల్డ్ కప్ టీమిండియా గెలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి మొత్తానికి షెడ్యూల్ వచ్చేసింది. హైదరాబాద్ లో టీమిండియా మ్యాచులు లేకపోవడం కాస్త నిరాశ కలిగించిన వరల్డ్ కప్ ఈ సారి అభిమానులకి మంచి కిక్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.