అది 2007 సెప్టెంబరు 24. దక్షిణాఫ్రికాలోని వాండరర్స్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ20 ప్రపంచకప్ టోర్నీ ఫైనల్. ఆ రోజును క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎంతో ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో విజయం చివరివరకు దోబూచులాడుతూ ఎట్టకేలకు భారత్ ను వరించింది. నిజానికి పాక్ బ్యాటర్ మిస్బా ఉల్ హక్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి విజయానికి చాలా దగ్గరకు తీసుకొచ్చాడు.
పాకిస్థాన్ విజయానికి చివరి 4 బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో సెట్ అయిన మిస్బా ఉల్ హక్ ఉండటంతో విజయం పాక్ దేనని అంతా భావించారు. కానీ.. జోగిందర్ శర్మ వేసిన బాల్‌ను మిస్బా ఉల్ హక్ పెడల్ స్వీప్ షాట్ ఆడాడు. అది నేరుగా వెళ్లి ఫైన్ లెగ్ ఫీల్డర్‌గా ఉన్న శ్రీశాంత్ చేతిలో పడింది. దాంతో భారత్ విజేతగా నిలవగా.. ఆ ఒక్క షాట్ పాక్ విజయాన్ని దూరం చేసింది. అయితే ఈ మ్యాచ్ ముగిసి 15 ఏళ్లు అయినా.. ఆ పెడల్ స్వీప్ షాట్‌ను మిస్బా ఉల్ హక్ మరిచిపోలేకపోతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు ఆ టోర్నీలో తాను ఔటైన తీరుపై స్పందించాడు. అత్మవిశ్వాసం ఎక్కువై ఔటైనట్లు వివరించాడు.
#OnThisDay in 2007, The cricket world saw the earliest glimpse of ‘Captain Cool’ MS Dhoni as he led India to a famous win over Pakistan in the T20 World Cup final in Johannesburg with a ‘masterstroke’ in the last-over thriller.
📽️: @BCCI@T20WorldCup | @ICC | @TheRealPCB#OTD pic.twitter.com/5HxUls4uWv
— SportED India (@SportEdIndia) September 24, 2020
“2007 ప్రపంచకప్ లో ప్రతి మ్యాచులోను స్కూప్ షాట్‌తో ఎన్నో ఫోర్లు బాదాను. ఆస్ట్రేలియాపై కూడా ఆ షాట్‌తో బాగా ఆడాను. స్పిన్నర్లపై మంచి ప్రదర్శన చేశాను. కానీ ఫైనల్లో ఆ బంతి బాదేటప్పుడు నాలో ఆత్మవిశ్వసం ఎక్కువైంది. దీంతో బంతిని కొట్టే టైమింగ్ తప్పింది. అందుకే ఔట్ అయ్యాను” అని మిస్బా చెప్పుకొచ్చాడు.
భారత్ నిర్ధేశించిన 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ తడబడింది. షాహిద్ అఫ్రిది, యూనిస్ ఖాన్, మాలిక్ వంటి దిగ్గజ బ్యాటర్లను టీమ్ఇండియా బౌలర్లు త్వరగా పెవిలియన్ చేర్చారు. కానీ మిస్బా ఉల్ హక్ మాత్రం ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి పాకిస్తాన్ ను విజయానికి దగ్గరకు తీసుకొచ్చాడు. విజయానికి చివరి ఓవర్లో 13 పరుగలు మాత్రమే అవసరం. జోగిందర్ శర్మ వేసిన చివరి ఓవర్లో రెండో బంతిని సిక్సర్‌గా మలిచిన మిస్బా ఉల్ హక్.. మూడో బంతికి స్కూప్ షాట్ ఆడబోయి శ్రీశాంత్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో భారత్ ఐదు పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా ధోని నాయకత్వంలో మెదటి ప్రపంచకప్ సాధించిన జట్టుగా అవతరించింది.
On This Day in 2007
India Became First Ever World Champions
ICC T20 World Cup 2007
Proud Moment For All Indians @YUVSTRONG12 #NewFomat #TalentedYoungSquad pic.twitter.com/OKDqwFecr5— Yuvraj Singh Forever (@Yuvians12) September 24, 2020