టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. పాదయాత్ర నేటితో 55వ రోజుకి చేరుకుంది. 55వ రోజు పాదయాత్ర పెనుకొండ నియోజకవర్గంలోని హరిపురం సమీపంలోని విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. పాదయాత్ర నేటితో 55వ రోజుకి చేరుకుంది. 55వ రోజు పాదయాత్ర పెనుకొండ నియోజకవర్గంలోని హరిపురం సమీపంలోని విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. సెల్ఫీల కార్యక్రమం తర్వాత లోకేశ్ తన పాదయాత్రను ప్రారంభించారు. రోజూలాగానే ఈరోజు సుమారుగా వెయ్యి మందికి లోకేశ్ సెల్ఫీ ఇచ్చారు. తనని కలవడానికి వచ్చిన ప్రజలను, యువతను ఆప్యాయంగా పలకరించి..సెల్ఫీ ఇచ్చారు. లోకేశ్ ఓపికగా వచ్చిన అందరితో సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హరిపురం వద్ద గ్రామస్థులతో మమేకమవుతూ లోకేశ్ పాదయాత్ర ముందుకు సాగింది.
టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. జనం పెద్ద సంఖ్యలో లోకేశ్ పాదయాత్రలో పాల్గొంటున్నారు. యువనేతకు తమ మద్దతు తెలియజేస్తున్నారు. లోకేశ్ ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఇక, పాదయాత్ర 55వ రోజుకు చేరుకుంది. 55వ రోజు పాదయాత్ర హరిపురం సమీపంలోని విడిది కేంద్రంనుంచి ప్రారంభం అయింది. లోకేశ్ యువగళం పాదయాత్ర పెనుగొండ నియోజకవర్గంలో 55వ రోజు 700కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.
గుట్టురూలో 700 కిలో మీటర్ల మైలు రాయికి శిలాఫలకం ఆవిష్కరణ చేశారు. పాదయాత్రలో భాగంగా ఎర్రమంచి చేరుకున్న లోకేశ్ కియా కార్ల పరిశ్రమల ఉద్యోగులతో ముఖాముఖి అయ్యారు. అలానే గుట్టూరులో రహదారి పక్కన వక్కలిగ సామాజిక వర్గీయులతో లోకేశ్ బాబు ముఖాముఖి అయ్యారు. 3.30 గంటలకు లోకేష్ రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి మండలంలోకి ప్రవేశించింది. ముఖాముఖి సమావేశాల్లో లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..” ఈ ప్రభుత్వం అడ్డగోలుగా బీసీలపై కేసులు పెడుతున్నారు. బీసీల భద్రతకు ప్రత్యేక చట్టాన్ని అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే తెస్తాం.
కేసులు రివ్యూ చేయడానికి జిల్లా స్థాయిలో కమిటీ కూడా ఏర్పాటు చేస్తాం. స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు వైసీపీ ప్రభుత్వం తొలగించడంతో 16 వేల పదవులు బీసీలు కోల్పోయారు. అలానే పట్టు రైతులకు ఈ ప్రభుత్వం పెట్టిన రూ.45 కోట్ల బాకీ మేము చెల్లిస్తాం. వక్క మార్కెట్ ను మడకశిరలో అధికారంలోకి రాగానే ఏర్పాటు చేస్తాం” అని లోకేశ్ అన్నారు. చెన్నేకొత్తపల్లి సమీపంలోని స్థానికులతో లోకేష్ ముఖాముఖి అయ్యారు. మరి.. 55వరోజు సాగిన లోకేశ్ పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.