టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 50వ రోజుకి చేరుకుంది. 50వ రోజు పాదయాత్ర పుట్టపర్తి నియోజకవర్గంలోని ఒనుకువారిపల్లి విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 50వ రోజుకి చేరుకుంది. 50వ రోజు పాదయాత్ర శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని ఒనుకువారిపల్లి విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. సెల్ఫీల కార్యక్రమం తర్వాత లోకేశ్ తన పాదయాత్రను ప్రారంభించారు. ఒనుకువారిపల్లి వద్ద యువతీ, యువకులతో లోకేష్ కాసేపు ముచ్చటించారు. అలానే ప్రతీ రోజూ తనని కలవడానికి వచ్చిన ప్రజలను, యువతను ఆప్యాయంగా పలకరించి లోకేశ్ సెల్ఫీ ఇచ్చారు. లోకేశ్ ఓపికగా వచ్చిన అందరితో సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. జనం పెద్ద సంఖ్యలో లోకేష్ పాదయాత్రలో పాల్గొంటున్నారు. యువనేతకు తమ మద్దతు తెలియజేస్తున్నారు. లోకేష్ ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటి వరకు లోకేశ్ 625 కి.మీ. దూరం నడిచారు. ఈ యువగళం పాదయాత్ర నేటితో 50వ రోజుకు చేరుకుంది. 50వ రోజు పాదయాత్ర ఒనుకువారిపల్లి విడిది కేంద్రంనుంచి ప్రారంభం అయింది.
గాజులకుంటపల్లిలో రైతులతో లోకేశ్ సమావేశం అయ్యారు. అక్కడ రైతులు పడుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ తరువాత వడ్డేపల్లిలో ఎస్టీ సామాజికవర్గానికి చెందిన పలువురితో లోకేశ్ భేటీ అయ్యారు. మధ్యాహ్నం సమయంలో ఒడిసి ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో మైనారిటీలతో లోకేశ్ భేటీ అయ్యారు. సాయంత్రం ఒడిసి రెయిన్ బో ఎడ్యుకేషన్ అకాడమీ వద్ద బహిరంగసభలో లోకేష్ ప్రసంగించారు. ఈ క్రమంలో సీఎంతో పాటు స్థానిక ఎమ్మెల్యేపై ఓ రేంజ్ లో విరుచకపడ్డారు. “శ్రీధర్ రెడ్డి పుట్టపర్తి ఎమ్మెల్యే నా లేక హైదరాబాద్ ఎమ్మెల్యే నా? ఆయన నియోజకవర్గంలో ఉండేది తక్కువ. హైదరాబాద్ లో ఉండేది ఎక్కువ. ఆయనకు కాంట్రాక్టులు.. రియల్ ఎస్టేట్ తప్ప ప్రజా సమస్యలు పట్టవు.
వారంలో ఒక రోజు పుట్టపర్తిలో ఉంటే ఆరు రోజులు ఇతర రాష్ట్రాల్లోనే ఉంటారు. ఈయన పేరు చెప్పి కుటుంబ సభ్యులు, అనుచరులు చేస్తున్న అరాచాకాలు అన్ని ఇన్ని కాదు” అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అలానే అనంతపురం లో ప్రతి గ్రామానికి సురక్షిత త్రాగునీరు అందించే బాధ్యత తనదేనని లోకేశ్ అన్నారు. శాసనసభలో తన తల్లి ని అవమానించారని, అలానే ఎంతో మంది మహిళల్ని వేధించారని, అలాంటి వారిని వదలనని లోకేశ్ నిప్పులు చేరిగారు. సాయంత్రం రామయ్యపేట విడిది కేంద్రంలో బస చేయనున్నారు. మరి.. 50 రోజు లోకేశ్ యువగళం పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.