టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 46వ రోజుకి చేరుకుంది. 46వ రోజు పాదయాత్ర కదిరి నియోజకవర్గంలోని చీకటిమానిపల్లె విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన “యువగళం” పాదయాత్ర శ్రీ సత్యసాయి జిల్లాలో శనివారం ప్రారంభమైంది. ప్రజలు పెద్ద సంఖ్యలో లోకేశ్ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. లోకేష్ పాదయాత్ర నేటితో 46వ రోజుకు చేరుకుంది. శనివారం కదిరి నియోజకవర్గంలోని చీకటిమానిపల్లి విడిది కేంద్రం నుంచి 46వ రోజు పాదయాత్ర నారా లోకేశ్ ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు ఆయన సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు 1000 మంది పార్టీ కార్యకర్తలు, సామాన్య జనంతో ఆయన సెల్ఫీలు దిగారు. అనంతరం పాదయాత్రను ప్రారంభించారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని చీకటిమానిపల్లి విడిది కేంద్రం నుండి 46 వ రోజు యువగళం పాదయాత్రను నారా లోకేశ్ ప్రారంభించారు. నియోజకవర్గం వ్యాప్తంగా తనని కలవడానికి వచ్చిన ప్రజలను ఉదయమే కలిసి లోకేశ్ ఫోటోలు దిగారు. లోకేష్ ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. పాదయాత్రలో భాగంగా.. కొక్కంటి క్రాస్ రోడ్డు వద్దకు లోకేశ్ కు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. లోకేష్ ని చూసేందుకు రోడ్ల పైకి భారీగా ప్రజలు చేరుకున్నారు. అలానే సమీపంలో ఉన్న భవనాల పైకి లోకేశ్ ను చూశారు. లోకేశ్ అందరికీ అందరికీ అభివాదం చేస్తూ ఆప్యాయంగా పలకరించారు. తనని కలవడానికి వచ్చిన యువత, మహిళలు, వృద్ధులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
కొక్కంటి క్రాస్ వద్ద ఎస్టీ సామాజిక వర్గం ప్రతినిధులతో నారా లోకేష్ ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగం పై యుద్ధం ప్రకటిస్తామన్నారు. “అధికారంలోకి వస్తే జగన్ పై కక్ష తీర్చుకుంటారా? అని కొంత మంది యువకులు నన్ను అడుగుతున్నారు. కక్ష సాధింపు మా ఎజెండా కాదు. రాష్ట్రంలో ఉన్న యువతీ, యువకులకు ఉద్యోగాలు కల్పించి జగన్ కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం” అని లోకేశ్ తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజన భవనాలు ఏర్పాటు చేస్తామని, గిరిజన ఆలయాల్లో పూజారులను నియమించి గౌరవ వేతనం అందజేస్తామని ఆయన తెలిపారు. అలానే టి.సదుం గ్రామానికి చెందిన బలిజ సమాజిక వర్గీయులు తమ సమస్యల గురించి లోకేశ్ తో విన్నవించారు.
వారి సమస్యలపై లోకేశ్ స్పందిస్తూ..టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాపులు,బలిజలకు అండగా నిలబడి న్యాయంచేస్తాం. జగన్ పాలనలో మహిళలకి రక్షణ కరవైందని తనకల్లు మండలం గందోడివారి పల్లికి చెందిన శశికళ అనే మహిళ నారా లోకేష్ ఎదుట ఆందోళన వ్యక్తం చేసింది. ఇంటి పక్కనే ఉండే వైసీపీ నాయకుడు తమపై దాడి చేశాడని, పోలీసులకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించింది. స్థానిక టిడిపి నేతలు అండగా ఉంటారని లోకేష్ శశికళకి భరోసా ఇచ్చారు. మరి.. 46వ రోజు కదిరి నియోజకవర్గంలో సాగిన లోకేశ్ యువగళం పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.