లోటస్ పాండ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వైఎస్ షర్మిలను అరెస్ట్ చేశారు. పోలీసు వాహనంలో ఆమెను బలవంతంగా తరలించారు. ఇంతకు ఏం జరిగింది అంటే..
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు వైఎస్ షర్మిల. 2019 ఎన్నికల ముందు వరకు అన్నకు మద్దతుగా నిలిచిన షర్మిల.. ప్రస్తుతం తెలంగాణకు మాత్రమే పరిమితం అయ్యారు. వైఎస్సార్‌తెలంగాణ పార్టీ పెట్టి.. ప్రజా సమస్యలపై దూకుడుగా ముందుకు వెళ్తున్నారు షర్మిల. ఇక తాజాగా సోమవారం మధ్యాహ్నం పోలీసులు షర్మిలను అరెస్ట్ చేశారు. ఆమె కారులో తన ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో షర్మిలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
పోలీసుల తీరుకు నిరసనగా షర్మిల అక్కడే లోటస్ పాండ్ వద్ద కాసేపు రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెను రోడ్డు మీద నుంచి లేవమని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేశారు. దాంతో షర్మిల పోలీసులను తోసేసుకుంటూ బయటకు వెళ్లేందుకు ప్రయత్నం చేశార. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను పక్కకు తోసేశారు. దీంతో షర్మిల ఇంటి వద్ద కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు.. వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా పోలీస్ వాహనంలోకి ఎక్కించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. షర్మిల అరెస్ట్ నేపథ్యంలో లోటస్ పాండ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై షర్మిల మండిపడ్డారు. సొంత పనులకు కూడా తనను బయటకు రాకుండా అడ్డుకుంటారా అంటూ ప్రశ్నించారు. తనను అరెస్ట్ చేయడానికి పోలీసులకు ఏమి అధికారం ఉందని షర్మిల వారిపై తీవ్రంగా మండి పడ్డారు. పోలీసులు ఈ విధంగా తనను తీవ్ర ఇబ్బందులను గురి చేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు. గతంలో కూడా అనేకసార్లు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారని, పలుమార్లు అరెస్ట్ చేశారని షర్మిల ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
సొంత పనుల కోసం బయటకు వెళ్తున్న తనను అడ్డుకోవడం ఏంటని షర్మిల ప్రశ్నిస్తున్నారు. అయితే ఇటీవలే షర్మి టి సేవ్ పేరుతో ఉద్యమం ప్రారంభించారు. ప్రతిపక్ష, విపక్ష పార్టీలందరినీ కలుపుకుని కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. తనకు మద్దతు ఇవ్వడమే కాక కలిసి రావాలని కాంగ్రెస్, బీజేపీ నేతలకు కాల్ చేశారు షర్మిల. అంతేకాక కొన్ని రోజుల క్రితం ఇందిరా పార్క్ వద్ద టి సేవ్ ఆధ్వర్యంలో ఉద్యమానికి పిలుపునిచ్చారు షర్మిల. కానీ పోలీసులు అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో.. హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకున్నారు. మరి షర్మిల అరెస్ట్‌పై మీ అభిప్రాయానలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
YS Sharmila seemingly slapped woman constable who was disposing her duties.
Police tried to house arrest her
She was moved to Jubilee Hills police station pic.twitter.com/nfUeJ3EuHZ
— Naveena Ghanate (@TheNaveena) April 24, 2023