14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సొంత నియోజకవర్గంలో ఆయనకు ఘోర అవమానం జరగినట్లు అయింది. దాదాపు 30 ఏళ్లుగా టీడీపీకి కంచుకోటలా ఉన్న చోట 23 ఏళ్ల యువతి వైఎస్సార్ పార్టీ నుంచి గెలుపోందింది. మూడు దశాబ్దాలుగా కుప్పంలో తెలుగుదేశం అభ్యర్థి తప్ప మరోక పార్టీ గెలిచిన దాఖలా లేదు.
అలాంటి టీడీపీ కంచుకోటను బద్దలుకొడుతూ 1073 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యర్థి అశ్విని జెడ్పీటీసీగా విజయం సాధించింది. ఈ ఓటమిని టీడీపీ కార్యకర్తలు ఘోర అవమానంగా భావిస్తున్నారు. అంతేకాక రాష్ట్రవ్యాప్తంగా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా నడిచింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం జెడ్పీటీసీ, ఆయన సొంత గ్రామం నారావారిపల్లి ఎంపీటీసీ స్థానాలను సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవడం విశేషం.