తాజాగా అండమాన్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రెండు వార్డుల్లో టీడీపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక అవకాశం దొరికితే టీడీపీ, చంద్రబాబు నాయుడిపై సెటైర్లు వేసేందుకు సిద్ధంగా ఉండే వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. అండమాన్ లో టీడీపీ సాధించిన విజయం మీద సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని ను అండమాన్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం అవుతారంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: ఈ సారి టీడీపీకి 160 సీట్లు ఖాయం: అచ్చెన్నాయుడు
“త్వరలోనే ముందస్తు ఎన్నికలు వస్తాయి…మళ్ళీ తాను ముఖ్యమంత్రిని కావడం ఖాయమని చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరక్క నానాఅగచాట్లు పడ్డ వాస్తవం మరచిపోయి ఇప్పుడు పగటికలలు కంటున్నారు. గెలుపు దేవుడెరుగు. ముందస్తు వస్తే ఈసారి మీ ప్రతిపక్షహోదాకే మూడుతుంది బాబూ” అంటూ చురకలు అంటించారు విజయసాయిరెడ్డి.
త్వరలోనే ముందస్తు ఎన్నికలు వస్తాయి…మళ్ళీ తాను ముఖ్యమంత్రిని కావడం ఖాయమని చంద్రబాబు ప్రగల్భాలు. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరక్క నానాఅగచాట్లు పడ్డ వాస్తవం మరచిపోయి ఇప్పుడు పగటికలలు కంటున్నారు. గెలుపు దేవుడెరుగు. ముందస్తు వస్తే ఈసారి మీ ప్రతిపక్షహోదాకే మూడుతుంది బాబూ.
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 9, 2022
ఇది కూడా చదవండి: నా హత్యకు అచ్చెన్నాయుడు కుట్ర పన్నారు: వైసీపీ ఎమ్మెల్సీ
‘‘అండమాన్ దీవుల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు (2 వార్డులు) గెలిచినందుకు టీడీపీ విజయోత్సవం జరుపుకుంటోంది. ఆంధ్రాలో ఇక ‘పార్టీలేదు-బొక్కాలేద’ని నిర్ధారించుకున్న అచ్చెన్న కూడా త్వరలో అండమాన్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు.” అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
అండమాన్ దీవుల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు (2 వార్డులు) గెలిచినందుకు టీడీపీ విజయోత్సవం జరుపుకుంటోంది. ఆంధ్రాలో ఇక ‘పార్టీలేదు-బొక్కాలేద’ని నిర్ధారించుకున్న అచ్చెన్న కూడా త్వరలో అండమాన్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 9, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.