ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసి.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే విభజన సందర్భంగా.. పదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని.. నాటి ప్రదాని మంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించారు. కానీ తర్వాత అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో అధికారం వేరే వారి చేతుల్లోకి వెళ్లింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పక్కకు పెట్టి.. ప్యాకేజీ ప్రకటించింది. అయితే రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆలోచించే నేతలు ఎవరైనా సరే.. కేంద్రం ఆలోచనను తప్పు పడతారు. కానీ నాడు అనగా విభజన తర్వాత 2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు.. కేంద్రం నిర్ణయానికి తల ఊపి.. హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అన్నాడు. దాంతో కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా పక్కకు పెట్టింది.
అప్పుడు విపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చంద్రబాబు తీరును తప్పుపట్టింది. ప్యాకేజీకి అమ్ముడు పోవద్దని.. ఇప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని పక్కకు పెడితే.. తిరిగి సాధించలేమని నొక్కి చెప్పింది. తాము అధికారంలోకి వస్తే.. ప్రత్యేక హోదా కోసం పోరాడతామని స్పష్టం చేసింది. ఇక ఎన్నికల ముందు చంద్రబాబు మాట మార్చి.. ప్యాకేజీ వద్దు.. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని మరోసారి మాట మార్చాడు. కానీ ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మలేదు. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో.. చంద్రబాబు చేసిన మోసాలకు తగిన విధంగా తమ ఓటుతో బుద్ధి చెప్పారు జనాలు. వైసీపీకి పట్టం కట్టారు. ఇక అధికార పార్టీ.. ముందునుంచి ప్రత్యేక హోదా అంశానికి కట్టుబడి ఉంది. సమయం వచ్చిన ప్రతి సారి ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని తెర మీదకు తీసుకువస్తూనే ఉంది.
తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్.. పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి మరోసారి గుర్తు చేశాడు. విభజన వల్ల ఏపీకి ఎంతో నష్టం వాటిల్లిందని తెలిపాడు. విభజన సందర్‌భంగా నటి ప్రధాని మన్మోహన్ సింగ్.. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రకటించారని తెలిపాడు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి గ్రాంట్ మంజూరు చేసి.. ఏపీకి న్యాయం చేయాలని కోరారు. విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం తండ్రి పాత్ర పోషించిందని.. మరి ఇద్దరు కొడుకులను విడదీసే సమయంలో ఒకరికి ఎక్కువ సంపద.. మరొకరికి తక్కువ ఆస్తి పంచడం ఎంత వరకు న్యాయమని ప్రసంగించారు.
పార్లమెంట్‌లో విభజన చట్టం ఆమోదం.. జరిగిన పరిణామాలను ఈ సందర్భంగా ఎంపీ భరత్ వివరించారు. నాడు విభజన సందర్భంగా సభలో మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు ఏపీకి అయిదేళ్లు కాదు, పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసారని ఎంపీ భరత్ చెప్పుకొచ్చారు. ఏపీకి నాడు ఇచ్చిన హామీలను గుర్తు చేసారు. సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన అంశాన్ని ప్రస్తావించారు. అలానే పోలవరం ప్రాజెక్ట్ అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు భరత్.
ఈ అంశంపై మార్గాని భరత్ ప్రసంగిస్తూ.. ఒక సందర్భంలో.. ప్రధాని నరేంద్ర మోదీని అనుకరించారు. పార్లమెంట్‌లో మోదీ నిల్చునే విధంగా అంటే.. ఎడమ చేతిని నడుము మీద పెట్టుకుని.. కుడి చేతిని.. తన ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి నిల్చుంటారు. ఇక ప్రత్యేక హోదా అంశంపై ప్రసంగిస్తూ.. భరత్ కూడా మోదీలానే నిల్చున్నాడు. ఈ సీన్ చూసిన వారు.. మోదీని దించేశావ్ భయ్యా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి