జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తాను చేనేత దుస్తులు ధరించి.. మరో ముగ్గురు నేతల్ని ట్యాగ్ చేశాడు పవన్. వీరిలో వైసీపీ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా ఉన్నాడు. ఈ క్రమంలో పవన్ చాలెంజ్‌కి స్పందిస్తూ.. చేనేత దుస్తులు ధరించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో బాలినేని పార్టీ మారబోతున్నారు.. వైసీపీని వీడనున్నారు అంటూ ప్రచారం సాగింది. తాజాగా ఈ వార్తలపై బాలినేని స్పందించారు. తాను చనిపోయేంతవరకు వైసీపీలోనే ఉంటానని.. పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు బాలినేని.
ఈ క్రమంలో ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై బాలినేని స్పందించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ కావాలనే కొంతమంది వ్యక్తులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు బాధాకరమని తెలిపారు. తనకు ఊసరవెల్లి రాజకీయాలు చేయడం చేతకాదని.. రాజకీయాల్లో ఉన్నంత వరకు.. తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ కుటుంబంతోనే ఉంటానని బాలినేని స్పష్టం చేశారు. పార్టీ మారే ఆలోచనే లేదన్నారు.
చేనేతల కుటుంబానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోందని.. ఓ మంచి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ చేసిన ట్విట్‌కు బదులిచ్చానని తెలిపారు. ఇటీవల కాలంలో తనపై జరుగుతున్న దుష్ప్రచారం గురించి సీఎం జగన్‌తో మాట్లాడతానని వెల్లడించారు. అలానే గోరంట్ల మాధవ్ విషయంలో విచారణ చేపట్టడం జరుగుతుందని తదనగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుది అని తెలిపారు. బాలినేని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.