సొంత పార్టీలో ఉంటూ రెబల్ ఎమ్మెల్యేగా ఉన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పార్టీ మీద, ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక కూడా అలానే ఉన్నారు. కానీ జగన్ అవేమీ పట్టించుకోకుండా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరికను నెరవేర్చారు.
సాధారణంగా ప్రతిపక్ష నేతలు పదవుల్లో ఉండి అధికార పక్షాన్ని తమ నియోజకవర్గానికి ఏమైనా చేయమని అడిగితే చేయరు. ఎందుకంటే ఆ క్రెడిట్ వారి ఖాతాలో పడిపోతుంది కాబట్టి. ఓట్లు తమ ఖాతాలో పడవు కాబట్టి అధికార పక్షం ఎప్పుడూ ప్రతిపక్షాన్ని చిన్న చూపు చూస్తుంటుంది. అయితే ఈ విషయంలో జగన్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అని అన్న మాటను నిజం చేసేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అడిగిన కోరికను జగన్ నెరవేర్చారు. ఈ మధ్య కాలంలో తిరుగుబాటు ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. ఏపీ ప్రభుత్వం మీద వరుస విమర్శలు చేస్తున్న ఈయనను ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని వైసీపీ పార్టీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన కోటంరెడ్డితోనే శభాష్ అనేలా చేశారు జగన్. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో కోటంరెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించిన అంశాల్లో బారాషాహీద్ దర్గా అంశం ఒకటి. ఈ దర్గా అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించామని కోటంరెడ్డి ఆరు నెలల పాటు తిరిగానని.. అయితే ప్రభుత్వం ఇప్పుడు జీవో విడుదల చేయడం సంతోషంగా ఉందని అన్నారు. బారాషాహీద్ దర్గా అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ. 15 కోట్ల నిధులకు సంబంధించి జీవో జారీ చేసింది. అందుకు సీఎం జగన్ కు కోటంరెడ్డి అభినందనలు తెలియజేశారు.
బారాషాహీద్ దర్గా అభివృద్ధి, మసీదు నిర్మాణం కోసం 9 నెలలు గడిచినా ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వలేదని, 6 నెలల పాటు ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగానని అన్నారు. నాలుగు సార్లు టెండర్లు పిలిచినా ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేదని.. ఎట్టకేలకు దర్గా అభివృద్ధి పనులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిందని.. సంతోషంగా ఉందని అన్నారు. తాము అడిగిన అంశాన్ని జగన్ పరిగణలోకి తీసుకుని పరిష్కరించడం పట్ల కోటంరెడ్డి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. మరి రెబల్ ఎమ్మెల్యే అయినా కూడా అవేమీ పట్టించుకోకుండా కోటంరెడ్డి అడిగిన దర్గా, మసీదు అభివృద్ధి కోసం నిధులు విడుదల చేసిన జగన్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.