ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారతిల వివాహం 1996లో ఆగస్ట్ 28న జరిగింది. ఆగస్ట్ 28 2022తో వీరి వివాహం జరిగి 26 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ప్రముఖులు, రాజకీయ నాయకులు, వైసీపీ పార్టీ కార్యకర్తలు జగన్, భారతి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే వీరి పెళ్లి ఫోటోలు, పెళ్లి శుభలేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్, భారతిల వివాహ పత్రిక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కడప జిల్లా, పులివెందులలో వైఎస్‌ఆర్‌ఆర్ లయోలా డిగ్రీ కళాశాలలో 1996 ఆగస్ట్ 28న అంటే బుధవారం నాడు ఉదయం 10.30 నుండి 11.15 గంటల మధ్య వీరి వివాహం జరిగింది. అప్పటికి జగన్ వయసు 24 ఏళ్ళు.
అదే ముహూర్తానికి వివేకానంద రెడ్డి కూతురు సునీత వివాహం కూడా జరిగింది. జగన్ వివాహ సమయంలో ఆయన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడపకి ఎంపీగా ఉన్నారు. జగన్ రాజకీయ నాయకుడిగా ఉండగా, భారతి పారిశ్రామిక రంగంలో విధులు నిర్వహిస్తున్నారు. వీరికి హర్షా రెడ్డి, వర్షా రెడ్డి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆగస్ట్ 28న వారి పెళ్ళి రోజు సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు ఈ ఫోటోని, వెడ్డింగ్ కార్డ్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జగన్, భారతి దంపతులకు విషెస్ చెబుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.