అధికారంలో ఉన్నాం కదాని.. నోటికి వచ్చినట్లు మాట్లాడితే కుదరదు. అసలే సోషల్ మీడియా కాలం ఇది. ఏమాత్రం చాన్స్ దొరికినా.. ఏకి పారేస్తారు. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభోత్సవ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసి.. విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: నా హత్యకు అచ్చెన్నాయుడు కుట్ర పన్నారు: వైసీపీ ఎమ్మెల్సీ
టెక్కలిలో జిల్లా ఆసుపత్రి భవన సముదాయాన్ని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దువ్వాడ టెక్కలి ఆస్పత్రి ఆవరణలోని టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన శిలాఫలకం తానే పగులకొట్టానన్నారు. మిస్టర్ ఎక్స్ కార్మికశాఖ మంత్రి.. ‘నేను చెబుతున్నా.. ఈ శిలాఫలకాల్ని మేమే విరగ్గొట్టాం. ఏం చేస్తావో చేసుకో’ అంటూ సవాల్ చేశారు. అంతేకాక టీడీపీ ప్రభుత్వ హయాంలో వందలాది శిలాఫలకాలు ధ్వంసం చేశారని ఎమ్మెల్సీ విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిల హయాంలో వేసిన శిలాఫలకాలను సైతం అచ్చెన్నాయుడు విడిచిపెట్టలేదని తెలిపారు.
ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే రోజాను ఢీకొట్టేందుకు సిద్ధమైన నటి వాణీ విశ్వనాథ్
ఎమ్మెల్సీ దువ్వాడ వ్యాఖ్యలకు పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం కృష్ణదాస్ షాకయ్యారు. తనను నిలువరించే ప్రయత్నం చేసినా.. దువ్వాడ వెనక్కు తగ్గలేదు. ఆ తర్వాత ఆయన శాంతించారు. కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులు ఉన్న వేదికపై శిలాఫలకం తానే ధ్వంసం చేశానని దువ్వాడ బహిరంగంగా ప్రకటించడంతో.. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో.. ఈ వ్యాఖ్యలపై శ్రీనివాస్ స్పందించారు. కలెక్టర్ సమక్షంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి రావడం బాధాకరంగా అనిపించిందని.. అధికారిక కార్యక్రమంలో ఇలా మాట్లాడకూడదని, క్షమించాలని కోరారు. దువ్వాడ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో వైసీపీ మహిళా నేత కన్నుమూత